Viral News: పొలంలో సీసీ కెమెరాల ఏర్పాటు.. ఎందుకో తెలుసా.?
అయితే తాజాగా వెల్లుల్లి రైతులు కూడా ఇదే బాట పట్టారు. అయితే ఇప్పుడు ఈ వంతు వెల్లుల్లి రైతులకు వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లోకి వెల్లుల్లి ధరలు భగ్గుమంటున్నాయి. కిలో వెల్లుల్లి ఏకంగా రూ. 500కి చేరింది. దీంతో తమ పంటను రక్షించుకునే క్రమంలోనే రైతులు కెమెరాలతో గస్తీ కాస్తున్నారు...

సాధారణంగా ఇంట్లో, ఆఫీసుల్లో, దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకంటామని తెలిసిందే. అయితే ఇప్పుడు పొలాల్లోనూ కెమెరాటు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇళ్లలో దొంగల భయానికి ఏర్పాటు చేసుకున్నట్లే, పొలాల్లోనూ పెట్టుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా టమాట ధరలు విపరీతంగా పెరిగిన సమయంలో టమాట పంటను కాపాడుకోవడానికి కొందరు రైతులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా వెల్లుల్లి రైతులు కూడా ఇదే బాట పట్టారు. అయితే ఇప్పుడు ఈ వంతు వెల్లుల్లి రైతులకు వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లోకి వెల్లుల్లి ధరలు భగ్గుమంటున్నాయి. కిలో వెల్లుల్లి ఏకంగా రూ. 500కి చేరింది. దీంతో తమ పంటను రక్షించుకునే క్రమంలోనే రైతులు కెమెరాలతో గస్తీ కాస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్ ప్రాంతంలోని అయిదారు గ్రామాల పొలాల్లో కొన్ని వెల్లుల్లి చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో రైతులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు.
కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత దొంగతనాలు ఆగిపోయాయని రాహుల్ దేశ్‌ముఖ్ అనే రైతు చెప్పుకొచ్చాడు. ఇక ఈ కెమెరాలు సౌరశక్తితో పనిచేస్తాయని, ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే అలారం మోగుతుందని మరో రైతు తెలిపారు. ఇదిలా ఉంటే గత 60 ఏళ్లలో ఎప్పుడూ వెల్లుల్లి ధరలు ఇంతగా పెరగలేదని రైతులు చెబుతున్నారు. వెల్లుల్లిపాయలు సాగు చేసిన రైతులు ధనవంతులయ్యారు కానీ ఇప్పుడు తాము పండించిన పంట చోరీకి గురవుతుందనే భయంతో ఉన్నమని వాపోతున్నారు.
చింద్వారా జిల్లాలో దాదాపు 1,500 హెక్టార్ల భూమిలో వెల్లుల్లి పంటను పండిస్తారు. జిల్లాలో ఉద్యాన పంటల మొత్తం విస్తీర్ణం లక్షా 30 హెక్టార్లు. కాగా 2023లో వెల్లుల్లికి మంచి ధర రాకపోవడంతో రైతులు పంట వేయడానికి ఆసక్తి చూపలేదు. సగటు ఉత్పత్తి 28 నుంచి 32 క్వింటాళ్ల వరకు ఉంటుందని రైతులు తెలిపారు. వెల్లుల్లి ధరలు ఇంతలా పెరగడానికి ఇదే కారణంగా చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
