Watch: బాబోయ్ ఎగిరే పాము చూశారా..? ఎలా వెంటపడుతుందో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

ఆ ప్రాంత ప్రజల గుండెల్లో భయాన్ని సృష్టించింది ఎగిరే పాము. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, పాము సెలూన్ బయట ఎగురుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. గాలిలో ఎగురుతున్న పామును చూసిన జనాలు, వీడియో చూసిన నెటిజన్లు స్టన్ అయిపోయారు.

Watch: బాబోయ్ ఎగిరే పాము చూశారా..? ఎలా వెంటపడుతుందో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..!
Flying Snake
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 07, 2024 | 7:19 AM

పాములు వేగంగా పరుగెడతాయి. కొన్ని పాములు చెట్లు, ఎత్తైన గోడలు కూడా ఈజీగా ఎక్కేస్తుంటాయి. అయితే, కొన్ని పాములు గాల్లో కూడా ఎగురుతాయని అప్పుడప్పుడు వార్తల్లో వింటుంటాం. అలాంటి ఎగిరే పాము వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. వీడియో ఫ్లయింగ్‌ స్నేక్‌ని చూసిన జనాలు భయంతో పరుగులు పెడుతున్నారు. ఈ షాకింగ్‌ వీడియో పంజాబ్‌కు చెందినదిగా తెలిసింది. పంజాబ్‌లోని జలాలాబాద్ జిల్లాలో సెలూన్ వెలుపల కూర్చున్న కొంతమంది స్నేహితులు ఏదో మాటల్లో నిమగ్నమయ్యారు. అంతలోనే అకస్మాత్తుగా ఎగిరే పాము వారి మీద నుండి వెళ్లింది. ఊహించని సంఘటనలో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటన జలాలాబాద్ జిల్లా బగ్గే మోడ్ సమీపంలో చోటుచేసుకుంది. జిల్లాలోని బాగే గ్రామం మలుపులో ఉన్న బ్రోస్ హెయిర్ సెలూన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. జూన్ 1న ఎన్నికలు ఉన్నందున దుకాణంలో పెద్దగా పని లేకపోవటంతో సెలూన్‌ యజమాని చరణ్‌ప్రీత్‌ సింగ్ సెలూన్‌లో పనిచేసే మరో ఇద్దరు కలిసి షాప్ బయట కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంతలోనే వారి మీద నుంచి ఏదో పొడవైన ఆకారం ఎగురుకుంటూ వెళ్లటం గమనించారు. గాల్లో పాము ఎగురుతున్న దృశ్యం చూసి వారంతా ఆందోళనకు గురయ్యారు. అంతే కాదు.. ఆ పామును వారి వెంటపడిందని చెప్పాడు. ఎగిరే పామును చూసి వారంతా భయాందోళనకు గురై అటు ఇటు పరిగెత్తారు. ఎగిరే పాము చివరకు సెలూన్‌లోని గ్లాస్‌కు తగిలి కిందపడిందని చెప్పాడు.. దాంతో అతి కష్టం మీద వారంతా తమ ప్రాణాలను కాపాడుకున్నామని, పాము నుంచి తప్పించుకుని ఎలాగోలా తిరిగి తమ ఇళ్లకు వెళ్లగలిగామని సెలూన్ యజమాని చెప్పాడు. సెలూన్‌ బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు కాగా, వీడియో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఆ ప్రాంత ప్రజల గుండెల్లో భయాన్ని సృష్టించింది ఎగిరే పాము. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, పాము సెలూన్ బయట ఎగురుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. దాని నుండి తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను స్పష్టంగా చూడవచ్చు. గాలిలో ఎగురుతున్న పామును చూసిన జనాలు, వీడియో చూసిన నెటిజన్లు స్టన్ అయిపోయారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి