Viral Video: రైలు పట్టాలపై ఈత కొడుతున్న చేపలు.. వైరల్‌ వీడియో..

రోడ్లపైకి భారీ ఎత్తున వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్‌లో గంటలతరబడి ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా విమానాలు, రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడింది. తాజాగా వర్షాలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో మళ్లీ ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారు. అయితే తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో...

Viral Video: రైలు పట్టాలపై ఈత కొడుతున్న చేపలు.. వైరల్‌ వీడియో..
Viral Video
Follow us

|

Updated on: Jul 11, 2024 | 5:43 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు కానీ ఉత్తరాదిలో మాత్రం ఓ రేంజ్‌లో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ముంబయి గరంలో భారీ వర్షాలకు అతలాకుతలమైంది. రోడ్లన్నీ నీటితో నిండిపోయి. జనవీవనం మొత్తం స్థంభించిపోయింది.

రోడ్లపైకి భారీ ఎత్తున వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్‌లో గంటలతరబడి ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా విమానాలు, రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడింది. తాజాగా వర్షాలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో మళ్లీ ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారు. అయితే తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో ముంబయిలో వర్షం ఏ రేంజ్‌లో కురిసిదో చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.

నగరంలో కురిసిన జోరు వానలకు రైల్వే ట్రాక్‌లన్నీ నీటితో నిండి పోయాయి. ఈ నేపథ్యంలో పట్టాలపై చేరిన నీటిలో ఏకంగా చేపలు దర్శనమిచ్చాయి. ఎంచక్కా ఆ నీటిలో స్విమ్మింగ్ చేస్తున్నాయి. దీంతో దీనిని అక్కడే ఉన్న కొందరు స్మార్ట్‌ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వామ్మో ఇవేం వర్షాలు బాబోయ అంటూ కామెంట్స్ చేస్తుంగా, మరికొందరు మాత్రం ఈ సీన్‌ చూడ్డానికి చాలా బాగుంది అంటూ స్పందిస్తున్నారు.

వైరల్ వీడియో..

ఇదిలా ఉంటే ముంబయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్పడ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..