కాళేశ్వరం అడవుల్లో చేపల వర్షం..! వింతను చూసి విస్తూపోయిన స్థానిక జనం..

హఠాత్తుగా ఆకాశం నుండి చేపల వర్షం కురవడంతో స్థానికులంతా చేపల కోసం ఎగబడ్డారు. ఈ విచిత్ర సంఘటనతో అక్కడి ప్రజలంతా ఆశ్చర్యపోయారు.

కాళేశ్వరం అడవుల్లో చేపల వర్షం..! వింతను చూసి విస్తూపోయిన స్థానిక జనం..
Fish Rain

Updated on: Jun 20, 2022 | 9:14 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అద్భుతం చోటు చేసుకుంది. హఠాత్తుగా ఆకాశం నుండి చేపల వర్షం కురవడంతో స్థానికులంతా చేపల కోసం ఎగబడ్డారు. ఈ విచిత్ర సంఘటనతో అక్కడి ప్రజలంతా ఆశ్చర్యపోయారు. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం అట‌వీ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో చేప‌లు ప్రత్యక్షమ‌వ‌డంతో జ‌నాలు ఆశ్చర్య పోతున్నారు.

ఆదివారం కురిసిన భారీ వర్షానికి అడవీ ప్రాంతంలో చేపలు ప్రత్యక్షం కావడంతో, ఉపాధిహామీ పనులకు వెళ్లిన కూలీలకు చేపలు కనబడటంతో చేపలను పట్టుకున్నారు. అనంతరం ఉపాధిహామీ కూలీలు మాట్లాడుతూ ఇప్పటివరకు ఇలాంటి చేపలను ఎప్పుడూ చూడలేదని ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో అని, ఆశ్చర్యానికి గురవుతున్నామన్నారు. అనంతరం ఉపాధిహామీ కూలీలు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఇలాంటి చేపలను ఎప్పుడూ చూడలేదని ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో అని, ఆశ్చర్యానికి గురవుతున్నామని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి