రొట్టెకు పామును కట్టి కొండముచ్చకు ఎరగా వేశారు.. ఇదేం ఆనందమో మరీ..! నెటిజన్ల ఫైర్..
ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో rajasthani_best_song అనే పేజీ మార్చి 15న షేర్ చేసింది. ఈ వీడియోను 28 లక్షలకు పైగా వీక్షించారు. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరులేని మూగజీవికి ఆహారం వేసి, ఇలా భయపెట్టడం సరికాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ప్రస్తుత ప్రపంచం అంతా ‘ఇంటర్నెట్’ మీదే ఆధారపడి పనిచేస్తోందనే చెప్పాలి. ముఖ్యంగా యావత్ ప్రపంచంపై సోషల్ మీడియా ఆధిపత్యం చెలాయిస్తుంది. సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాకు విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. సోషల్ మీడియాలో నిత్యం అద్భుతమైన కంటెంట్ కనిపిస్తుంది. అంతేకాదు కొన్నిసార్లు వింత దృశ్యాలు కూడా కనిపిస్తాయి. అవి మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో అలాంటి దృశ్యమే కనిపిస్తోంది. ఈ వీడియోలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక కొండముచ్చును భయపెట్టించేందుకు చేసిన ప్రయత్నం నెట్టింట వైరల్‌గా మారింది.
ఓ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో కొండముచ్చు రోడ్డుపై పడివున్న రొట్టేను ఇంటి పైకప్పునుంచి ఎగురుకుంటూ వచ్చింది. పాపం అది రొట్టె తీసుకొని అక్కడి నుండి బయలుదేరినప్పుడు, దానికి ఊహించని సీన్ ఎదురైంది. రొట్టేను చేతబట్టుకుని వెళ్తుండగా…ఒక పాము కనిపించింది. ఆ పాము కొండముచ్చు వైపు దూసుకుపోతోంది. దాంతో ఆ మూగజీవి ఒక్కసారిగా ఉలిక్కిపడింది..కంగుతిన్న కొండముచ్చు..భయంతో దూకింది. కానీ, అది ఫేక్ పాము అని ఆ తర్వాత తెలిసింది. ఓ నకిలీ పామును ఉంచారు.
నకిలీ పామును రొట్టెకు దారంతో కట్టేసి కనిపించకుండా పెట్టారు. ఆ రొట్టేను కోండముచ్చుకు దగ్గర వేశారు. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో rajasthani_best_song అనే పేజీ మార్చి 15న షేర్ చేసింది. ఈ వీడియోను 28 లక్షలకు పైగా వీక్షించారు. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరులేని మూగజీవికి ఆహారం వేసి, ఇలా భయపెట్టడం సరికాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.




మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..