AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వేలు చూపిస్తూ ఒకరు.. బ్యాట్‌తో మరొకరు.. లైవ్ మ్యాచ్‌లో బూతుల వర్షం.. వైరల్ వీడియో..

Nitish Rana vs Hrithik Shokeen: ఐపీఎల్ 2023 మ్యాచ్‌లు కొనసాగుతున్న కొద్దీ ఉత్కంఠ కూడా పెరిగిపోతోంది. సీజన్ పురోగమిస్తున్న కొద్దీ ఎండలు కూడా తమ సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలో ఆటగాళ్లలోనూ యుద్ధ వాతావరణం క్రమంగా పెరుగుతోంది.

Video: వేలు చూపిస్తూ ఒకరు.. బ్యాట్‌తో మరొకరు.. లైవ్ మ్యాచ్‌లో బూతుల వర్షం.. వైరల్ వీడియో..
Nitish Rana Vs Hrithik Shokeen
Venkata Chari
|

Updated on: Apr 16, 2023 | 6:10 PM

Share

ఐపీఎల్ 2023 మ్యాచ్‌లు కొనసాగుతున్న కొద్దీ ఉత్కంఠ కూడా పెరిగిపోతోంది. సీజన్ పురోగమిస్తున్న కొద్దీ ఎండలు కూడా తమ సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలో ఆటగాళ్లలోనూ యుద్ధ వాతావరణం క్రమంగా పెరుగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు, ఆటగాళ్ల మధ్య గొడవలు లేదా వివాదాస్పదమైన సందర్భాలు అంతగా కనిపించలేదు. కానీ, ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియం మాత్రం ఫుల్ హీటెక్కింది. అది కూడా వేర్వేరు జట్లకు ఆడుతున్న ఇద్దరు ఢిల్లీ ఆటగాళ్ల మధ్య కావడం గమనార్హం.

వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. సూర్యుడు ఆకాశంలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు. ఉష్ణోగ్రత కూడా దాదాపు 34 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. మైదానంలో మ్యాచ్ కూడా సమానంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో KKR కెప్టెన్ నితీష్ రాణా, ముంబై స్పిన్నర్ హృతిక్ షోకీన్ మధ్య భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. వేలు, బ్యాట్‌ను చూపుతూ సైగతలతో దుర్భాషలాడారు.

ఇవి కూడా చదవండి

హృతిక్ వేలు చూపించగా, నితీష్ బ్యాట్ తీశాడు..

తొలుత బ్యాటింగ్ చేస్తున్న కోల్ కతా 8 ఓవర్లలో 73 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ నితీష్ రాణా క్రీజులో ఉన్నాడు. తొమ్మిదో ఓవర్లో, ముంబై 22 ఏళ్ల స్పిన్నర్ హృతిక్ షోకీన్ వేసిన మొదటి బంతిని గాలిలో ఆడాడు. కానీ, బౌండరీ వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక్కడ నితీష్ పెవిలియన్ వైపు తిరిగి వస్తున్నాడు. ఇంతలో హృతిక్ షోకీన్ అతని వైపు వెళ్లి ఏదో మాట్లాడాడు. నితీష్ ఆగిపోయాడు.

నితీష్ కూడా ఏదో మాట్లాడుతున్నాడు. వెంటనే హృతిక్ కోపంతో అతని వైపు వేలు చూపించాడు. దీంతో సహనం కోల్పోయి నితీష్ బ్యాట్ చూపిస్తూ దుర్భాషలాడాడు.

10 ఏళ్ల నాటి జ్ఞాపకాలు తాజాగా..

ఇద్దరు ఆటగాళ్లు దగ్గరగా వచ్చారు. విషయాలు అదుపు తప్పకముందే, ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు. నితీష్, హృతిక్ మధ్య జరిగిన ఈ రచ్చ సుమారు 10 సంవత్సరాల క్రితం జరిగిన జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చింది. అంతకుముందు 2013లో కూడా ఢిల్లీకి చెందిన జూనియర్, సీనియర్ ఆటగాడి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో కేకేఆర్‌ కెప్టెన్‌ గౌతం గంభీర్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యువ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గొడవపడ్డారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..