Tollywood: ఈ తెలుగు నటిని గుర్తుపట్టారా..? ఏ పాత్ర ఇచ్చినా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తుంది..
ఈమె తెలుగులో మంచి యాంకర్. ఆ తర్వాత నటిగా మారింది. సినిమాల్లో మరిచిపోలేని పాత్రలు వేసింది. ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇప్పటికీ అదిరే ఫిట్ నెస్‌తో యూత్‌కు ఛాలెంజ్ విసురుతుంది.

ఈమె ఎవరో గుర్తుపట్టగలరా…? ఒకప్పుడు తెలుగు యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత నటిగా పలు సినిమాల్లో మెప్పించింది. ఇప్పటికీ అంతే చెక్కు చెదరని అందంతో.. టీనేజ్ యువతకు ఫిట్ నెస్ ఛాలెంజ్ విసురుతుంది..? ఏంటి మాస్టారు ఐడియా రావడం లేదా.. “సూరీడు.. సూరీడు.. బేగ రారా.. అవతల బస్సుకు వేళయిపోతుంది..” అంటూ ఛత్రపతి సినిమాలో డైలాగ్ చెప్తుంది కదా.. తనే తిను. పేరు అనిత చౌదరి. ఇప్పుడు అందరికీ ఆమె గుర్తుకువచ్చి ఉంటుంది. తెలుగులో ఒకప్పుడు అగ్ర యాంకర్‌గా కొనసాగిన ఈమె… పలు షోల ద్వారా మంచి ఫేమ్ సంపాదించింది. నాన్న, రుతురాగాలు, అమృతం, కస్తూరి వంటి సీరియల్స్‌తో విపరీతంగా పాపులర్ అయ్యింది.
ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 100 పైగా సినిమాల్లో నటించింది అనితా చౌదరి. నువ్వే నువ్వే, ఛత్రపతి, సంతోషం, రాజా, మన్మథుడు వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో మంచి పాత్రలు చేసింది. ప్రజంట్ మాత్రం అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తుంది. ఆ తర్వాత ఓ NRIని పెళ్లి చేసుకున్నారు అనిత. ఇటు ఫ్యామిలీకి స్పేస్ ఇస్తూనే.. అటు సినీ కెరీర్‌నూ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వీరికి ఓ అబ్బాయి ఉన్నాడు. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. నెటిజన్స్‌తో తన అప్ డేట్స్ పంచుకుంటూ ఉంటారు. తనతో పని చేసిన నటీనటులకు, టెక్నిషీయన్లకు బర్త్ డే విషెస్ చెబుతూ ఉంటారు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. ఈమె సింగర్ సునీత, యాంకర్ సుమ, ఝాన్సీలకు బెస్ట్ ఫ్రెండ్. చాలా టాలెంట్ ఉన్న.. అనిత చౌదరి మళ్లీ బిజీ ఆర్టిస్ట్ అవ్వాలని మనం కోరుకుందాం.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
