Virupaksha Pre Release Event: ఏలూరుకు పోటెత్తిన మెగా ఫ్యాన్స్.. గ్రాండ్‌గా విరూపాక్ష ప్రి రిలీజ్ ఈవెంట్

Virupaksha Pre Release Event: ఏలూరుకు పోటెత్తిన మెగా ఫ్యాన్స్.. గ్రాండ్‌గా విరూపాక్ష ప్రి రిలీజ్ ఈవెంట్

Ram Naramaneni

|

Updated on: Apr 16, 2023 | 7:42 PM

విరూపాక్ష సినిమా ను ఏప్రిల్ 21 న పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాంతారా ఫేమ్ ‘అజనీష్ లోకనాథ్’ ఈ సినిమాకు సంగీతం అందించాడు. . మిస్టరీ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది.

నూతన దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్‌లో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష.  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మాత బీ.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. సంయుక్త మీనన్ విరూపాక్షలో హీరోయిన్ గా నటించింది. అజయ్, సాయి చంద్,  సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, శ్యామల తదితరులు కీ రోల్స్‌లో నటించారు. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి రచన సహకారం అందించాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న అనంతరం సాయి తేజ్ ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏప్రిల్ 21 న సినిమా రిలీజ్ అవ్వనుంది. కాగా ఏప్రిల్ 16 (ఆదివారం) ఏలూరులోని సి.ఆర్ రెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. లైవ్ చూడండి…

Published on: Apr 16, 2023 07:40 PM