AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మనిషి రూపంలోని రాక్షసుడు.. ముసలావిడను రైలు నుంచి తోసేసి.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Viral Video Elderly Abuse Train: సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. వృద్ధాప్యంలో ఉన్నవారికి అండగా నిలవాల్సింది పోయి, ఇలా మృత్యు ముఖంలోకి నెట్టేసే ఇలాంటి కిరాతకులకు చట్టం కఠినమైన శిక్షలు విధించినప్పుడే ఇలాంటి అమానుషాలకు అడ్డుకట్ట పడుతుంది.

Viral Video: మనిషి రూపంలోని రాక్షసుడు.. ముసలావిడను రైలు నుంచి తోసేసి.. ఆ తర్వాత ఏం చేశాడంటే?
Elderly Woman Train Track Cctv Video
Venkata Chari
|

Updated on: Jun 10, 2026 | 1:17 PM

Share

Elderly Woman Train Track CCTV: మానవత్వం మంటగలిసిపోతోన్న ఈ రోజుల్లో కన్నవారిని, వృద్ధులను రోడ్డున పడేసే కఠిన హృదయులను ఎందరినో చూసుంటాం. కానీ, రైలు నుంచి ఒక నిస్సహాయ వృద్ధురాలని కఠినంగా కిందకు నెట్టేసిన ఒక దారుణ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను కుదిపేస్తోంది. ఈ అమానుష ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసిన నెటిజన్లు సదరు వ్యక్తిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

సీసీటీవీ కెమెరాలో రికార్డైన అమానుషం..

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఒక నిమిషంలోపు నిడివి గల ఈ సీసీటీవీ దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. రైలు పెట్టె లోపల ఉన్న కెమెరాలో రికార్డైన వివరాల ప్రకారం.. తెల్లటి జుట్టు, లేత రంగు జాకెట్, ఎరుపు రంగు బూట్లు ధరించిన ఒక వృద్ధురాలు రైలు తలుపుల వద్ద నిలబడి ఉంది. ఆమె వెనుకాలే నల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు ఉన్నాడు.

రైలు ఒక నిర్జన ప్రదేశంలో పట్టాల పక్కన ఆగగానే, ఆ యువకుడు ఆమెను బలవంతంగా రైలు నుంచి కిందకు నెట్టేశాడు. ప్లాట్‌ఫారమ్ కూడా లేని ఆ ప్రమాదకరమైన చోట, రాళ్లు, గులకరాళ్లతో నిండిన రైలు పట్టాల పక్కన పడిపోయింది.

వెన్నులో వణుకు పుట్టించే క్రూరత్వం..

ఆ వృద్ధురాలు కింద పడిపోగానే ఆ యువకుడు ఏమాత్రం జాలి లేకుండా వెనక్కి తిరిగి రైలు తలుపులను మూసివేశాడు. ఆ నిస్సహాయ వృద్ధురాలు ఆ ప్రమాదకరమైన లోయ లాంటి ట్రాక్ పక్కన ఏం చేయాలో తెలియక నిలబడిపోయింది.

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనబడే ప్రజా రవాణా వ్యవస్థల్లో వృద్ధులకు కనీస రక్షణ కరువైందనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. ఆమెను అక్కడ నెట్టేసి వెళ్లడం వెనుక సదరు యువకుడి ఉద్దేశం ఏంటనేది స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ దృశ్యాలు మాత్రం చూసేవారికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. ఉరి తీయాలంటూ డిమాండ్లు..

ఈ భయంకరమైన వీడియో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా బయటకు రాగానే క్షణాల్లో వైరల్‌గా మారింది. వేలాది మంది ఈ వీడియోను వీక్షించడమే కాకుండా, ఆ యువకుడి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్ దేశానికి చెందిన నెటిజన్లు ఈ వీడియోపై అత్యంత ఘాటుగా స్పందిస్తున్నారు.

“ఇలాంటి వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు, నడిరోడ్డుపై ఉరితీయాలి” అంటూ కొందరు కామెంట్లు పెడుతుండగా, “కన్నతల్లి లాంటి వృద్ధురాలిని అంత ప్రమాదకరమైన చోట ఎలా వదిలే బుద్ధి పుట్టింది? వీడు అస్సలు మనిషేనా?” అంటూ మరికొందరు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. వృద్ధుల భద్రతపై రైల్వే శాఖలు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us