Egg White Whisky: మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు
మీరు కూడా మద్యం ప్రియులా..అయితే, మీకు మద్యం ఎలా తాగాలో తెలిసే ఉంటుంది. దాదాపుగా అందరూ మందులో నీళ్లు, లేదంటే, సోడా కలిపి తీసుకుంటారు. కానీ, మీరు ఎప్పుడైనా ఆమ్లెట్ కు బదులుగా విస్కీలో పచ్చి గుడ్డు కలిపి తిన్నారా..? వైరల్ గా మారిన ఈ వెరైటీ కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి..ఇంటర్‌నెట్‌లో ఇది ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. అదేంటో ఫుల్ డిటెల్స్‌కి వెళితే..

విస్కీ రుచికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కానీ, ఇటీవల విస్కీలో ఎగ్ వైట్ కలిపి తాగే ట్రెండ్ ఇప్పుడు ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది. కొందరు దీనిని ఎగ్ విస్కీ, లేదంటే, ఎగ్ వైట్ విస్కీ సావర్ అని పిలుస్తున్నారు. ఈ వెరైటీ డ్రింక్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇది చూసిన నెటిజన్లతో పాటుగా, చాలామంది మద్యం ప్రియులు సైతం దీనిని వింతగా భావిస్తున్నారు.
సాధారణంగా ప్రజలు క్లాసిక్ లేదా సాంప్రదాయ వెర్షన్ విస్కీ గురించి తెలుసుకుంటారు. కానీ, విస్కీలో గుడ్డులోని తెల్లసొనను కలిపి తీసుకోవచ్చనే ఆలోచన చాలా మందికి కొత్తది. బార్లలో ఇలాంటి మిక్డ్స్ డ్రింక్ అంతగా కనిపించకపోయినా కొందరు దీనిని కొత్త ప్రయోగంగా అభినందిస్తున్నారు. ఈ డ్రింక్ తయారుచేసే విధానం కూడా చాలా ఈజీ.
ఇందుకోసం ఒక గుడ్డులోని తెల్లసొనను బాగా కొట్టి, 60 మిల్లి లీటర్ల విస్కీతో కలుపుతారు. దీనివల్ల మిశ్రమం క్రీమీగా మారుతుంది. తరువాత నిమ్మరసం వేసి ఐస్ తో కలిపి సర్వ్ చేస్తున్నారు. అయితే, ఈ డ్రింక్ వెనుక ఉన్న శాస్త్రాన్ని వివరిస్తూ, వైన్ నిపుణురాలు సోనాల్ హాలండ్ ఇలా వివరించారు.
సోనాల్ హాలండ్ ప్రకారం.. గుడ్డులోని తెల్లసొన విస్కీకి మృదువైన, క్రీమీ ఆకృతిని ఇస్తుంది. పానీయం పైన నురుగు కనిపిస్తుంది. ఇది విస్కీ రంగు, రూపాన్ని మారుస్తుంది. అంతేగానీ, విస్కీ అసలు రుచి పెద్దగా మారదు. కానీ ఈ పానీయం క్రీమీ రుచిని ఇస్తుందని చెప్పారు. ఇకపోతే, విస్కీలో గుడ్డు కలిపారని చెప్పినప్పుడు చాలా మందికి గుడ్డు వాసనపై అనుమానం వస్తుంది. కానీ ఈ డ్రింక్‌లో గుడ్డు రుచి లేదని సోనాల్ హాలండ్ స్పష్టం చేశారు.
గుడ్డుతో విస్కీ అందరికీ నచ్చదు. కొందరు దీనిని కొత్తదనంగా సమర్ధిస్తే, మరికొందరు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కానీ చాలామంది సాంప్రదాయకంగా నిమ్మరసం, చక్కెరతో విస్కీతో తాగే క్లాసిక్ వెర్షన్ అత్యంత స్వచ్ఛమైనదని నమ్ముతారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…




