Video: కొద్ది నిమిషాల్లో ఎగ్జామ్.. విద్యార్థి హాల్ టిక్కెట్ తన్నుకుపోయిన గద్ద! అసలు ట్విస్ట్ ఆ తర్వాతే..
కేరళలోని కసర్గోడ్ జిల్లాలో ఓ విద్యార్థి పరీక్ష హాల్ టికెట్‌ను గద్ద దొంగిలించింది. పరీక్ష ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు ఈ ఘటన జరిగింది. గద్ద హాల్ టికెట్‌ను ఎత్తుకెళ్లిన తరువాత, ఆ విద్యార్థి బాగా ఏడ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మన నుంచి ఎవరైనా ఏదైనా వస్తువు దొంగిలించినా, లేదా మనకు రావాల్సిన అవకాశాన్ని ఎవరైనా లాక్కున్నా.. గద్దలా వచ్చి తన్నుకుపోయాడ్రా అని అంటాం. కానీ, ఇక్కడ నిజంగానే గద్ద వచ్చి విద్యార్థి హాల్ టిక్కెట్‌ను తన్నుకుపోయింది. అది కూడా పరీక్షకు కొద్ది నిమిషాల ముందు. పరీక్షలంటే అసలే భయం ఉంటుంది. పైగా టెన్త్ క్లాస్, ఇంటర్ విద్యార్థులైతే.. ఎగ్జామ్స్ అంటేనే వణికిపోతుంటారు. హాల్ టిక్కెట్ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ.. పరీక్షలకు హాజరువుతుంటారు. ఆలాంటి ఓ విద్యార్థి ఎగ్జామ్‌కు ముందు ఎగ్జామ్ సెంటర్‌లో హాల్ టిక్కెట్ పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో మాయదారి గద్ద.. వేగంగా వచ్చి హాల్ టిక్కెట్‌ను తీసుకెళ్లింది.
ఈ ఊహించని పరిణామంతో ఆ విద్యార్థికి ఏం చేయాలో తెలియలేదు. అటు చూస్తే మరికొద్ది నిమిషాల్లో పరీక్ష మొదలువుతుంది, హాల్ టిక్కెట్ లేకుంటే పరీక్ష రాసేందుకు అనుమతించరు. ఏం చేయాల తెలియక.. ఇక ఆ విద్యార్థి ఏడుపు అందుకున్నాడు. ఈ ఘటన కేరళలోని కసర్ గోడ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ పాఠశాలలో కేరళ టెన్త్ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 7:30 గంటల సమయంలో ఓ విద్యార్థి కిటీకీ పక్కన కూర్చుని చదువుకుంటూ ఉన్నాడు. హాల్ టికెట్ ను కిటికీ పక్కనే పెట్టాడు.
ఇంతలో ఓ గద్ద ఒక్కసారిగా వచ్చి ఆ హాల్ టికెట్ ఎత్తుకెళ్లింది. పాఠశాలపై అంతస్తులోని కిటికీపై నిల్చొని చూస్తూ ఉంది. దీంతో తోటి విద్యార్థులు గద్దకు రాళ్లు విసిరారు. అయినా హాల్ టికెట్ వదల్లేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే చోటు చేసుకుంది. హాల్ టిక్కెట్ పోయిందని ఏడుస్తున్న ఆ విద్యార్థి ఏడుపుకు కరిగిపోయింది ఏమో కానీ.. సరిగ్గా పరీక్షకు ఓ ఐదు నిమిషాలు ఉందన్న టైమ్‌లో హాల్ టిక్కెట్‌ను విద్యార్థి ముందు వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఆ విద్యార్థి లటుక్కున హాల్ టిక్కెట్ అందుకొని.. కళ్లు తుడుచుకుంటూ.. కాస్త నవ్వి పరీక్షకు వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
केरळात एका विचित्र घटनेने अचंबित केले आहे. कासरगोड जिल्ह्यातील एका शाळेत केरळ पब्लिक सर्व्हिस कमिशन (PSC) च्या परीक्षेआधी एका विद्यार्थ्यांचं हॉल तिकीट एका गरुडाने पळवलं आहे. ही घटना गुरुवारी (10 एप्रिल) सकाळी घडली.#Kerala #ViralVideo #HallTicket #PSC #Viral #LatestNews pic.twitter.com/c9x1hJ0koP
— SakalMedia (@SakalMediaNews) April 10, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
