Viral: ఫుడ్ ఆర్డర్ కోసం ఆతృతగా ఎదురుచూశాడు.. తీరా పార్శిల్ ఓపెన్ చేసి ఖంగుతిన్నాడు..
ఇటీవల చాలామంది ఆన్‌లైన్ కొనుగోళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. బట్టల నుంచి బ్యాటరీల వరకు.. మొబైల్ ఫోన్ల నుంచి ల్యాప్‌టాప్స్ వరకు..
ఇటీవల చాలామంది ఆన్‌లైన్ కొనుగోళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. బట్టల నుంచి బ్యాటరీల వరకు.. మొబైల్ ఫోన్ల నుంచి ల్యాప్‌టాప్స్ వరకు.. ఇలా ఒకటేమిటి.. అన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే దొరికేస్తున్నాయి. అటు ఫుడ్‌ను కూడా డెలివరీ చేసే యాప్స్ చాలానే రావడంతో.. ఎంతోమంది తమ ఇంటి దగ్గర నుంచే ఇష్టమైన ఫుడ్స్‌ను ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది గానీ.. అప్పుడప్పుడూ తాము పెట్టిన ఆర్డర్స్‌లో.. వాటికి సంబంధం లేని వస్తువులు కొన్ని వస్తుండటం.. అవి చూసి కస్టమర్లు షాక్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. అయితే ప్లేస్ ఎక్కడో తెలియదు గానీ.. అందుకు సంబంధించిన వీడియోను కస్టమర్ టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ యాప్ ‘డోర్ డాష్’ నుంచి ఓ వ్యక్తి ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ సాండ్‌విచ్ ఆర్డర్ పెట్టాడు. తన ఫుడ్ పార్శిల్ కోసం ఎంతగానో ఆతృతగా ఎదురు చూశాడు. ఇక ఆ పార్శిల్ రానే వచ్చింది. ఇష్టంగా దాన్ని ఓపెన్ చేశాడు.. అంతే! దెబ్బకు ఖంగుతిన్నాడు. సాండ్‌విచ్ రాలేదు గానీ.. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్‌తో పాటు వచ్చిన వాడిపడేసిన కండోమ్‌ను చూసి సదరు వ్యక్తి మైండ్ బ్లాంక్ అయింది. కాగా ఈ విషయంపై ఆ ఫుడ్ డెలివరీ సంస్థకు అతడు ఫిర్యాదు చేయగా.. డబ్బులు వాపస్ వచ్చాయి. అలాగే సదరు కంపెనీ.. ఈ ఘటన ఎలా చోటు చేసుకుందన్న దానిపై దర్యాప్తు చేస్తోందని సమాచారం.