Viral Video: కదిలే వాహనంపై శక్తిమాన్‌లా ఫోజులిస్తూ, స్టంట్స్ చేశాడు.. సీన్ కట్‌చేస్తే.. ఊహించని షాక్..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ యువకుడి ప్రమాదకర విన్యాసాలపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని..

Viral Video: కదిలే వాహనంపై శక్తిమాన్‌లా ఫోజులిస్తూ, స్టంట్స్ చేశాడు.. సీన్ కట్‌చేస్తే.. ఊహించని షాక్..
Truck Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jul 20, 2022 | 6:40 PM

వాహనాలపై భీకరంగా ఫోజులు కొట్టినా.. దూకుడుగా వ్యవహరించినా.. ఆ తర్వాత పశ్చాత్తాపం పడాల్సిందేనని పోలీసులు కోరుతున్నారు. ఇందుకోసం ఓ వీడియోను షేర్ చేసి మరీ ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ఈ వీడియోలో ఓ యువకుడు వాహనంపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ పోలీసు ఆఫీసర్ శ్వేతా శ్రీవాస్తవ ఆదివారం ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఓ యువకుడు చెత్త వాహనంలో శక్తిమాన్‌లాగా విన్యాసాలు చేస్తు్న్నట్లు చూడొచ్చు. కదులుతున్న చెత్త ట్రక్కుపై పుష్‌అప్‌లు కొట్టాడు. ఆ తరువాత వాహనంపై నిలబడి ఒక అడుగు ముందుకు వేశాడు. అయితే వాహనం ఒక్కసారిగా మలుపు తిప్పడంతో అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువకుడి ఫొటోలను కూడా వీడియోలో చేర్చారు. ‘నిన్న రాత్రి (శనివారం) లక్నోలోని గోమతి నగర్‌లో ఓ దృశ్యం. శక్తిమాన్‌గా బిల్డప్‌లు ఇద్దామనుకున్నాడు. కానీ, అలా జరగలేదు. దయచేసి ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయకండి” అంటూ అందులో పోలీసులు రాసుకొచ్చారు.

కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ యువకుడి ప్రమాదకర విన్యాసాలపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానా విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, తీవ్రంగా గాయపడిన యువకుడు లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో అతడిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు కూడా సిద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ