Python – 2 dogs: ఒకేసారి రెండు పెంపుడు కుక్కలను మింగుతున్న కొండచిలువ… ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..
మాములుగా పెట్ డాగ్స్ ఎప్పుడూ యజమానిని అంటి పెట్టుకునే ఉంటాయి. ఒకవేళ యజమాని ఇంట్లో లేకపోతే అతను వచ్చేవరకు అలా ఎదురుచూస్తేనే ఉంటాయి.
మాములుగా పెట్ డాగ్స్ ఎప్పుడూ యజమానిని అంటి పెట్టుకునే ఉంటాయి. ఒకవేళ యజమాని ఇంట్లో లేకపోతే అతను వచ్చేవరకు అలా ఎదురుచూస్తేనే ఉంటాయి. అలాంటిది ఓ వ్యక్తికి చెందిన 2 పెంపుడు కుక్కలు అదృశ్యం అయ్యాయి. ఎంత వెతికినా వాటి ఆచూకి కనిపించలేదు. దీంతో ఆ ఓనర్ ఆందోళన చెందాడు. ఈ క్రమంలోనే ఓవ్యక్తికి అదే గ్రామంలోని ఓ మరుగు ప్రాంతంలో పాత కాంక్రీట్ స్తంభాలపై పాకుతూ భారీ కొండచిలువ కనిపించింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పాడు. అందరూ వచ్చి చెక్ చేయగా.. ఆ పైథాన్ అస్సలు కదల్లేకపోతుంది. పొట్ట భారీగా ఉబ్బి ఉంది. అప్పుడు అర్థం అయ్యింది.. ఆ కొండచిలువ పెట్ డాగ్స్‌ను ఆహారంగా తీసుకుందని. దీంతో ఆ ఓనర్ తల్లిడిల్లిపోయాడు. ఈ ఘటన ఈశాన్య థాయ్‌లాండ్‌లోని సిసాకేట్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఇది ఇప్పటివరకు తాము చూసిన పాములలో అతి పెద్దదని ఒక స్థానికుడు తెలిపాడు. కొండచిలువ ఆ బంజరు భూమిలో మాటు వేసి.. కొంతకాలంగా గ్రామంలోని జంతువులను మింగేస్తుందని అతను అభిప్రాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో యానిమల్ రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని.. దాన్ని బంధించి పునరావాస కేంద్రానికి తరలించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

