Watch Video: యజమానిని కాపాడేందుకు ఈ కుక్క ఏం చేసిందో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

ఆ ప్రేమతో కుక్కలు తమ యజమానుల కోసం ఏం చేయటానికైనా సిద్ధపడుతుంటాయి. కొందరు యజమానులు కూడా తమ పెంపుడు కుక్క కోసం ప్రాణాలకు తెగిస్తుంటారు. ఇక్కడ జరిగిన రెండు సంఘటనలు కుక్క మీద మనిషికి, యజమానిపైన ఆ శునకం ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాయి. ఒక కుక్క దాని యజమానిని ఇబ్బందుల నుండి తప్పించింది. మరొక సంఘటనలో ఒక కుక్క ప్రాణాన్ని రక్షించడానికి JCB డ్రైవర్

Watch Video: యజమానిని కాపాడేందుకు ఈ కుక్క ఏం చేసిందో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
Dog Saves Owner Life
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 26, 2024 | 12:42 PM

కుక్క మనిషికి అత్యంత ప్రియమైన, స్నేహపూర్వక జంతువులు. ఇది మనుషులతో కలిసి, జనావాసాల్లో చాలా సౌకర్యవంతంగా జీవిస్తుంది. కుక్కను విశ్వాసానికి మారుపేరుగా కూడా చెబుతారు. ఈ క్రమంలోనే చాలా మంది కుక్కల్ని తమ పెంపుడు జంతువులుగా పెంచుకుంటూ ఉంటారు. మనిషికి, కుక్క మధ్య చెప్పలేని బంధం ఏర్పాటు చేసుకుంటారు. ఆ ప్రేమతో కుక్కలు తమ యజమానుల కోసం ఏం చేయటానికైనా సిద్ధపడుతుంటాయి. కొందరు యజమానులు కూడా తమ పెంపుడు కుక్క కోసం ప్రాణాలకు తెగిస్తుంటారు. ఇక్కడ జరిగిన రెండు సంఘటనలు కుక్క మీద మనిషికి, యజమానిపైన ఆ శునకం ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాయి. ఒక కుక్క దాని యజమానిని ఇబ్బందుల నుండి తప్పించింది. మరొక సంఘటనలో ఒక కుక్క ప్రాణాన్ని రక్షించడానికి JCB డ్రైవర్ అద్భుతమైన ట్రిక్ చేసాడు.

ఒక సంఘటనలో కుక్క ఒకటి లోతైన గొయ్యిలో పడిపోయింది. చుట్టూ మట్టి పెళ్లలు రాలుతూ ఉండటంతో ఆ కుక్క బయటకు రాలేకపోతుంది. అది గమనించిన జేసీబీ డ్రైవర్‌ ఒకరు ఆ కుక్కను రక్షించారు. జేసీబీ బౌల్‌కి ఎక్కిన ఆ కుక్క లోతైన గొయ్యిలోంచి ఈజీగా ఒడ్డుకు చేరింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఇక్కడ మరో వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో ఒక కుక్క తన యజమానికి రక్షించటం కనిపిస్తుంది. తన యజమానిని ఒక లోతైన ఐరన్‌ కట్టడంలో పడిపోయి ఉన్నాడు. ఇది ఎలా జరిగిందో తెలియదు గానీ, అతను అందులోంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ, రాలేకపోతున్నాడు. దీంతో కుక్క దాని యజమానిని రక్షించేందుకు ఒక ఉపాయం చేసింది. ఒక పెద్ద సంచిలాంటి వస్తువును అతడు ఆ కుక్క అందించాడు. దానిని ఒక చివరన ఆ కుక్క నోటితో బలంగా పట్టుకుంది..మరో చివరన ఆ వ్యక్తి చేతపట్టుకుని గొయ్యి నుండి బయటకు వచ్చేశాడు. ఇలా కుక్క తన విధేయతను నిరూపించుకుంది.

ఈ వీడియో చూడండి..

@Gulzar_sahab X ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో కామెంట్లు చేస్తున్నారు. ఒక వ్యక్తి చెప్పాడు – జంతువులు మనిషికి అత్యంత విశ్వసనీయ సహచరులు అని. అవును, మూగజీవాలు మనుషుల పట్ల అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటాయని మరొకరు ట్విట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..