Watch: ఉత్తరప్రదేశ్‌లో ప్రజలను వణికిస్తున్న తోడేళ్లు.. ఆరోది ఇలా చిక్కింది..!
తాజాగా అదే ప్రాంతంలో ఆరవ తోడేలు కనిపించింది. మహ్సీలోని సికందర్‌పూర్ ప్రాంతంలో తోడేలు కనిపించగా స్థానికులు వీడియోలు తీశారు. ఇప్పటి వరకు తోడేళ్ల దాడిలో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు, మరో 60 మందికి పైగా గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని తోడేళ్ల దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు ప్రజలు, అటు అధికార యంత్రాంగం కంటి మీద కునుకు లేకుండా తోడేళ్ల వేట కొనసాగిస్తున్నారు. బహ్రైచ్‌లో ఇప్పటి వరకు ఐదు తోడేళ్లను బంధించారు. అయినా తోడేళ్ల బీభత్సం ఏ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం రాత్రి కూడా ఓ బాలికపై తోడేలు దాడి చేసింది. తాజాగా అదే ప్రాంతంలో ఆరవ తోడేలు కనిపించింది. మహ్సీలోని సికందర్‌పూర్ ప్రాంతంలో తోడేలు కనిపించగా స్థానికులు వీడియోలు తీశారు. ఇప్పటి వరకు తోడేళ్ల దాడిలో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు, మరో 60 మందికి పైగా గాయపడ్డారు. దీంతో తోడేలును పట్టుకునేందుకు అటవీ శాఖ సెర్చ్ ఆపరేషన్ చేప్టటారు. ఆరోవ తోడేలు ‘ఆల్ఫా’ కోసం అధికారులు వేట కొనసాగిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..