ఓర్నీ.. దొంగలు ఇలా కూడా ఉంటారా ?? సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
హైదరాబాద్ నగరం సంతోష్ నగర్ పరిధిలోని ఫిసల్ బండ ప్రాంతంలో ఓ శవర్మా సెంటర్ ఉంది. అక్కడకు ఓ యువకుడు వచ్చి ఆ షాపు యజమానిని వాటర్ బాటిల్ కావాలని అడిగాడు. యజమాని వాటర్ బాటిల్ తీసి ఇచ్చాడు. దాన్ని కాసేపు అటూ ఇటూ పరిశీలించినట్టు చేసి, తర్వాత డబ్బులిచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు ఆ యువకుడు. ఇక్కడ ఆ యువకుడు ఓ ఖతర్నాక్ పని చేనాడు.
హైదరాబాద్ నగరం సంతోష్ నగర్ పరిధిలోని ఫిసల్ బండ ప్రాంతంలో ఓ శవర్మా సెంటర్ ఉంది. అక్కడకు ఓ యువకుడు వచ్చి ఆ షాపు యజమానిని వాటర్ బాటిల్ కావాలని అడిగాడు. యజమాని వాటర్ బాటిల్ తీసి ఇచ్చాడు. దాన్ని కాసేపు అటూ ఇటూ పరిశీలించినట్టు చేసి, తర్వాత డబ్బులిచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు ఆ యువకుడు. ఇక్కడ ఆ యువకుడు ఓ ఖతర్నాక్ పని చేనాడు. యజమాని వాటర్ ఫ్రిజ్‌లోంచి వాటర్ బాటిల్ తీస్తున్న సమయంలో అక్కడే టేబుల్ పైన ఉన్న మొబైల్‌ను యువకుడు తీసేసి తన పాకెట్‌లో పెట్టేసుకున్నాడు. తిరిగి ఏమీ ఎరుగనట్టు వాటర్ బాటిల్ చెక్ చేసి, దొంగ చూపులు చూస్తూ చివరలో సీసీటీవీ కెమెరా ఏమైనా ఉందా అని కూడా చూసాడు. అక్కడ సీసీ టీవీ కెమెరా కనిపించినా ఏమాత్రం జంకకుండా దర్జాగా వాటర్‌బాటిల్ తీసుకొని వెళ్లిపోయాడు. ఈ విషయం తెలియని షాపు ఓనర్ తనపనిలో మునిగిపోయాడు.. ఫోన్ పోయిందన్న విషయాన్ని అతను గమనించనేలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఓర్నీ.. దొంగలు ఇలా కూడా ఉంటారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కన్నడ భాషలో డాక్టర్ల మందుల చీటీలు.. నెట్టింట వైరల్
అలాంటి SMSలను నమ్మితే.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ !!
స్టార్ హెల్త్ లో పాలసీ ఉందా ?? మీ డేటా డౌటే !!