Viral Videos: కాపీ కొట్టడం మీకేకాదు మాకూవచ్చు.. నవ్వులూ పూయిస్తున్న కక్క విన్యాసాలు..
సోషల్ మీడియాలో చాలా రకాల శునకాలను మీరు చూసి ఉంటారు. కొన్ని ముద్దు.. ముద్దుగా ఉంటే.. మరికొన్ని చాలా భయంకరంగా ప్రవర్తిస్తుంటాయి. ఇందులో కొన్ని మాత్రం చాలా తెలివైన కుక్కలు కనిపిస్తుంటాయి.

సోషల్ మీడియాలో చాలా రకాల శునకాలను మీరు చూసి ఉంటారు. కొన్ని ముద్దు.. ముద్దుగా ఉంటే.. మరికొన్ని చాలా భయంకరంగా ప్రవర్తిస్తుంటాయి. ఇందులో కొన్ని మాత్రం చాలా తెలివైన కుక్కలు కనిపిస్తుంటాయి. అవి చేసే పనులు అద్భుతం అనిపిస్తాయి. వాటిలో కొన్ని పూర్తి స్తాయిలో ట్రైనింగ్ పొందినవి అయితే.. మరికొన్ని ట్రైనింగ్ లేకుండానే అద్భుతాలను చేస్తుంటాయి. అంతేకాదు అవి చేసే పనులను చూస్తే నవ్వు తెప్పిస్తుంటుంది. ఇప్పుడు అలాంటి ఓ కుక్కకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఒప్పుకుంటారు.. జంతువులకు కూడా ఫిట్‌నెస్ మీద అవగాహన పెరుగుతోందని.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడు ఎక్సైర్‌సైజ్ చేస్తుంటే.. అతడిని వెనుక నుంచి ఓ కుక్క కాపీ చేస్తుంది. అది అచ్చు అతను ఎలా చేస్తున్నాడో అలా మక్కీకి మక్కీ కాపీ చూస్తుంది. కుక్క కూడా అతనిని అనుకరించడం చూసిన జనం నవ్వు ఆపుకోలేకపోతున్నారు.
ఈ వీడియో చూడండి
Real follower ?? pic.twitter.com/4wB9ZKDLmf
— Susanta Nanda (@susantananda3) December 5, 2021
ఈ ఫన్నీ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా (Ifs susanta nanda) ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోతోపాటు అతను క్యాప్షన్ రాశారు – ఇది నిజమైన ఫాలోవర్. దీనిపై జనాలు ఫన్నీ రియాక్షన్స్ కూడా చేస్తున్నారు.
Real follower ?? pic.twitter.com/4wB9ZKDLmf
— Susanta Nanda (@susantananda3) December 5, 2021
సోషల్ మీడియలో ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజనం తెగ నవ్వుకుంటున్నారు. అదే స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. అదే చేసే పనిని చూసి ముచ్చట పడుతున్నారు.
ఇవి కూడా చదవండి: చేపలు అమ్ముకునే మహిళను బస్సు ఎక్కనివ్వని అధికారులు.. కన్యాకుమారిలో ఆధునిక అనాగరికం..
