Viral Video: దొంగతనం చేస్తూ పట్టుబడిన కుక్క.. ఆ తర్వాత ఏం చేసిందో చూశారా ?
దొంగిలిచడం ఓ ఆర్ట్ అయితే.. దొరికిపోకుండా ఉండడమే తెలివి.. కావాలనుకున్న వస్తువులను ఇతరులకు తెలియకుండా తీసుకోవడం
దొంగిలిచడం ఓ ఆర్ట్ అయితే.. దొరికిపోకుండా ఉండడమే తెలివి.. కావాలనుకున్న వస్తువులను ఇతరులకు తెలియకుండా తీసుకోవడం కూడా చాలా కష్టమే. ఒక వేళ పట్టుబడితే ఇంకేమైన ఉందా ? అందరి ముందు పరువు పోతుంది. అలాగే అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది… ఇలాంటి అంశాలు మనుషులకు సరిపోతాయి.. మరి జంతువులకు… అవి కూడా తమకు నచ్చిన వస్తువులను దొంగిలిస్తూ పట్టుబడితే ఎలా ఉంటుంది ? అయితే వాటికి కూడా మనుషుల మాదిరిగానే ఫీలింగ్స్ ఉంటాయా ? తప్పు చేశామనే భావన ఉంటుందా ? అనేది ఈ వీడియో చూస్తే కలిగే సందేహాలు.. తాజాగా ఓ కుక్క.. ఆకలి తీర్చుకోవడానికి.. కిచెన్ లో ఉన్న బాక్స్ దొంగిలించింది.. అయితే ఆకస్మాత్తుగా తన యాజమానికి దొరికిపోవడంతో.. అటు ఇటు తటాపటాయించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఓ కుక్క ఎంతో ఆకలితో కిచెన్ లో ఉన్న బాక్స్ అతి కష్టమీద నోట కరుచుకుంది. ఆహారం దొరికిందన్న ఆనందంలో వెళ్లబోతున్న ఆ కుక్కకు ఎదురుగా తన యాజమాని కనిపించేసరికి కంగుతిన్నది. దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో ఆ కుక్కకు ఏం చేయాలో తెలియలేదు. దీంతో తప్పు చేసినట్లుగా తల దించుకుంది. అలా చాలా సేపు తల దించుకుని ఉండి.. ఆ తర్వాత ఆ బాక్స్ అక్కడ వదిలేసి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుక్క పిల్ల చిలిపి దొంగతనం వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి..
ట్వీట్..
Caught ya ?? pic.twitter.com/Z39TVM5yWN
— Rebecca (@beckx28) October 14, 2021
Trisha: డిజిటల్ పై సత్తా చాటేందుకు సిద్ధమైన స్టార్ హీరోయిన్.. ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్న త్రిష..
Bigg Boss 5 Telugu: రైస్ కుక్కర్ తెచ్చిన తంట.. ప్రియ పై చిందులేసిన శ్వేత.. మీ టోన్ నచ్చలేదంటూ..