Viral: 9 నెలల బాలుడికి ఎన్ని మెడిసిన్ వాడినా దగ్గు తగ్గట్లే.. ఆస్పత్రిలో ఎక్స్ రే తీయించగా
బాలుడి వయస్సు 9 నెలలు. దాదాపు 20 రోజులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడు. పేరెంట్స్ స్థానికంగా మెడిసిన్ తీసుకుని వాడుతున్నారు కానీ పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ప్రవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ టెస్టులు చేయగా అసలు విషయం తేలింది.

బాలుడి తల్లిదండ్రులు తబస్సుమ్, జునేద్ యూసుఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని జునాగఢ్‌కు చెందిన తొమ్మిది నెలల బాలుడు మోహమ్మద్ గత పద్దెనిమిది రోజులుగా బాలుడు తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడు. జునాగఢ్‌లోని ఓ పిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. టెస్టులు చేశారు. ఎక్స్‌రేలో తీయగా బాలుడి శ్వాసనాళంలో ఓ వస్తువు ఇరుక్కున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత మరింత అనాలిసిస్ చేయగా అది.. అది ఓ ఆడుకునే ఫోన్‌కు ఉండే ఎల్ఈడీ బల్బుగా నిర్ధారిచారు. అక్కడ చికిత్సకు ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పడంతో.. తల్లిదండ్రులు బాలుడ్ని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి బల్బును విజయవంతంగా తొలగించారు. బాలుడి ఆడుకుండా ఆ బల్బ్ మింగి ఉంటాడని భావిస్తున్నారు.
జూన్ 3న ఆసుపత్రిలో చేరిన చిన్నపిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ రాకేష్ జోషి, అనస్తీషియా విభాగానికి చెందిన డాక్టర్ నీలేష్ నేతృత్వంలోని బృందం బ్రోంకోస్కోపీ పద్ధతిలో ఆ బల్బును తొలగించారు. ఇది బాలుడి కుడి శ్వాసనాళంలో ఇరుక్కుపోయి ఉన్నట్లు చెప్పారు. ఆపరేషన్ అనంతరం బాలుడు కోలుకుంటున్నాడని.. ఆరోగ్యం మెరుగుపడడంతో త్వరలో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని వివరించారు.

Removed Bulb
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..