Viral News: ‘ప్రాణాలు నిలబెడుతున్నారు, రక్తాన్ని చెమట రూపంలో దారబోస్తున్నారు’… వైరల్ అవుతోన్న డాక్టర్ పోస్ట్
ఇండియాలో ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కోవిడ్ -19 కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది.
ఇండియాలో ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కోవిడ్ -19 కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో దేశంపై తుఫానులాగా దాడి చేస్తొంది. ఆరోగ్య సంక్షోభం వేగంగా పెరిగేకొద్దీ, దేశంలో వైద్య మౌలిక సదుపాయాలు దాదాపు పతన దశకు చేరాయి. ఈ క్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ప్రతిరోజూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పౌరులను రక్షించడానికి వారు అహర్నిశలు కృషి చేస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఒక పోస్ట్ ఇంటర్నెట్ లో తెగ సర్కులేట్ అవుతుంది. ఒక వైద్యుడు 15 గంటల పాటు నిరంతరాయంగా పీపీఈ కిట్ ధరించి సేవల అందించడం వల్ల చెమటతో తడిసి ముద్దయ్యాడన్నది ఆ పోస్ట్ సారాంశం. ఈ పోస్ట్‌ను ఏప్రిల్ 28న బుధవారం డాక్టర్ సోహిల్‌గా గుర్తించిన యూజర్ ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేయబడింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పోస్ట్‌లో, డాక్టర్ రెండు ఫోటోస్ పంచుకున్నారు, మొదటి దాంట్లో ఆయన పీపీఈ కిట్ ధరించి కనిపించారు. రెండవ ఫోటోలో పూర్తిగా చెమటలో తడిసిపోయి కనిపించారు.
ప్రజలు ప్రస్తుతం కష్ట సమయాల్లో ఉన్నారని, ఈ క్రమంలో సామాజిక దూరాన్ని కొనసాగించడం అత్యంత అవసరమని డాక్టర్ పోస్ట్ లో పేర్కొన్నారు. కరోనావైరస్ బారిన పడకుండా సురక్షితంగా ఉండటానికి ఇది ఏకైక పరిష్కారం చెప్పారు. అర్హులైన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని అభ్యర్థించారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కుటుంబాలకు దూరంగా ఉంటూ చాలా కష్టపడుతున్నారని, అయినప్పటికీ దేశానికి సేవ చేయడం గర్వంగా ఉందని సదరు డాక్టర్ చెప్పుకొచ్చారు. ఈ వైరల్ పోస్ట్ వేలాది లైక్‌లు, రీట్వీట్‌లను సంపాదించింది. ప్రజలు సదరు వైద్యుడిని అభినందిస్తున్నారు.
Proud to serve the nation pic.twitter.com/xwyGSax39y
— Dr_sohil (@DrSohil) April 28, 2021
Also Read: కొడుకు పెళ్లిరోజున బాంబు పేల్చిన మహిళ.. మరీ ఇలా చేసిందేంటి.. అందరూ షాక్