AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వేడి నుంచి ఉపశమనం కోసం ఇలాంటి ఐడియా మీరు ఎప్పుడూ చూసి ఉండరు.. ఫన్నీ వీడియో వైరల్

ఏసీలు సామాన్యులకు అందని ద్రాక్షనే. ప్రతి ఒక్కరూ వీటి ధరను భరించలేరు. దీంతో ఎంత వేడి ఉన్నా సామాన్యుడు ఇప్పటికీ ఫ్యాన్ సాయంతో తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అయితే ఇప్పుడు ఒక ఫ్యాన్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఫ్యాన్స్ గాలి ఒక వ్యక్తికీ మాత్రమే తగిలేలా ఏర్పాటు చేసుకుంది ఉంది.

Viral Video: వేడి నుంచి ఉపశమనం కోసం ఇలాంటి ఐడియా మీరు ఎప్పుడూ చూసి ఉండరు.. ఫన్నీ వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Jun 02, 2023 | 12:31 PM

Share

ప్రకృతిలో వచ్చిన మార్పులతో కాలాల్లో మార్పు వస్తున్నాయి. వేసావిలో వర్షాలు కురుస్తున్నాయి. కాలంతో పనిలేకుండా ఎండ వేడి ప్రజలను మడిస్తోంది. ఏడాది ఏడాదికి వేసవి తాపం పెరుగుతోంది. ఈ సీజన్ వస్తే చాలు జనానికి చెమటలతో ఇబ్బంది పడతారు. అయితే ఒకప్పుడు ఫ్యాన్లు లేకున్నా హాయిగా బతికేవారు.. అయితే ప్రకృతిలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఏడాది ఏడాదికి వేడి అధికం అవుతూనే ఉంది. ముందు ఫ్యాన్లు వచ్చాయి. తర్వాత కూలర్లు వచ్చాయి. వేడిని తట్టుకునేందుకు ఇప్పుడు జనం ఏసీ వాడటం మొదలుపెట్టారు. అయితే ఏసీలు సామాన్యులకు అందని ద్రాక్షనే. ప్రతి ఒక్కరూ వీటి ధరను భరించలేరు. దీంతో ఎంత వేడి ఉన్నా సామాన్యుడు ఇప్పటికీ ఫ్యాన్ సాయంతో తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అయితే ఇప్పుడు ఒక ఫ్యాన్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఫ్యాన్స్ గాలి ఒక వ్యక్తికీ మాత్రమే తగిలేలా ఏర్పాటు చేసుకుంది ఉంది. ఈ ఫన్నీ జుగాద్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూపారులను నవ్విస్తోంది.

ఒక వ్యక్తి పెద్ద ప్లాస్టిక్ లోపల పడుకుని.. ఒక చివర ఫ్యాన్‌ని ఏర్పాటు చేశాడు. ఆ ఫ్యాన్స్ ఎటు కదలకుండా గాలి వీస్తుంది. దీంతో ఆ ఫ్యాన్ గాలి ఆ వ్యక్తి శరీరానికి నేరుగా తగులుతుంది. గాలి తగులుతున్న అనుభూతిని చెందుతున్నాడు. ఆ గాలి ఎటు వెళ్లకుండా నేరుగా ఆ వ్యక్తికీ మాత్రమే తగులుతుంది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ఏర్పాటు చేసుకున్న ట్రిక్ ఇప్పటి వరకూ ఎవరూ చూసి ఉండరు. జుగాద్ విషయంలో భారతీయులను ఎవరూ ఓడించలేరని, ఈ వీడియో చూసిన తర్వాత ఈ విషయం మీకే అర్థమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ జుగాద్ వీడియో టెక్నికల్_పర్సనల్ అనే ఐడితో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది, ఇది ఇప్పటివరకు 23 వేలకు పైగా వ్యూస్, వందలాది మంది లైక్ చేసారు.

అదే సమయంలో ఈ వీడియో చూసిన తర్వాత వివిధ ఫన్నీ రియాక్షన్లు ఇచ్చారు. ‘ఇది మూర్ఖత్వమే.. ప్రమాదకరం కూడా కావచ్చు’ అని కొందరంటే.. కొందరు తమాషాగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఈ జుగాడ్ మాత్రం అద్భుతమని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..