AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swiggy: కస్టమర్‌తో పులిహోర కలిపిన స్విగ్గీ డెలివరీ బాయ్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..

ఓ డెలివరీ బాయ్ కలిపిన పులిహోర చూసి, నెటిజన్లు తూటాలు పేల్చుతున్నాారు. మనోడి చెత్త పనికి నెటిజన్లు మండిపడుతున్నారు.

Swiggy: కస్టమర్‌తో పులిహోర కలిపిన స్విగ్గీ డెలివరీ బాయ్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..
Swiggy
Ravi Kiran
|

Updated on: Jun 19, 2022 | 10:08 AM

Share

గర్ల్‌ఫ్రెండ్‌ లేదా పక్కింటమ్మాయితో పులిహోర కలిపితే అందంగా ఉంటుంది. అంతే కాకుండా క్లాస్‌మేట్‌తోనూ పులిహోర కలిపినా కిక్ ఇస్తుంది. ఇది సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ అప్పుడప్పుడూ మనకు కనిపిస్తూనే ఉంటుంది. అయితే, తాజాగా ఓ డెలివరీ బాయ్ కలిపిన పులిహోర చూసి, నెటిజన్లు తూటాలు పేల్చుతున్నాారు. మనోడి చెత్త పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ .. ఓ కస్టమర్‌తో ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి ఇటీవల స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది. కొద్దిసేపటికి ఇంటికి ఫుడ్ ఆర్డర్ తీసుకొచ్చాడు డెలివరీ బాయ్. ఆమె ఆ ఫుడ్‌ పార్శిల్‌ను తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. ఆ ఫుడ్ డెలివరీ బాయ్ నుంచి ‘miss u lot’, ‘nice your beauty’, ‘nice your eyes’ అంటూ వరుసపెట్టి మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. మనోడి పులిహోర కలపడం మరీ శృతి మించిపోవడంతో సదరు యువతి స్విగ్గీ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసింది. తొలుత ఆమె ఫిర్యాదుపై స్విగ్గీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ట్విట్టర్ వేదికగా నెటిజన్లకు విషయాన్ని వెల్లడించింది. దీనితో డెలివరీ బాయ్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా స్విగ్గీ తీరును కూడా వారు ఖండించారు.

కాగా, ఇంత జరిగిన తర్వాత ఎట్టకేలకు దిగొచ్చిన స్విగ్గీ.. సదరు యువతికి క్షమాపణలు చెప్పడమే కాకుండా ఇబ్బందులకు గురి చేసిన డెలివరీ బాయ్‌పై చర్యలు తీసుకుంటామని.. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

Swiggy Screen Shot