Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతు ప్రేమికులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతారు. వీడియోలను మళ్లీ మళ్లీ చూస్తారు. జంతువులు, పక్షుల వేటకు సంబంధించిన వీడియోలు కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు మాత్రం ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. తాజాగా గద్దకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఆకాశంలో ఎగురుతూ సముద్రంలోని చేపను వేటాడటమంటే మామూలు విషయం కాదు కదా..
వీడియోలో ఓ గద్ద చేపను వేటాడటం మనం చూడవచ్చు. సాధారణంగా చేపలు వేటాడమంటే ఎంత కష్టమో అందరికి తెలుసు. కానీ ఈ గద్ద ఆకాశం నుంచి సముద్రంలో ఉన్న చేపను గుర్తించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాదు నీటిలో చేప చాలా సులువుగా తప్పించుకుంటుంది. అటువంటి చేపను గద్ద ఒడిసిపట్టిన తీరు అద్భుతం. వీడియోలో గద్ద మొదటగా సముద్రం నీటిపై వాలుతుంది. తర్వాత దాని కాళ్ల మధ్య చేపను బంధించి గాల్లోకి ఎగరడానికి ప్రయత్నిస్తుంటుంది. అప్పుడు ఆ చేప.. గద్ద రెండు కాళ్ల మధ్య గిలా గిలా కొట్టుకుంటుంది. గద్ద బలంగా తన రెక్కలతో ఎగురుతూ ఆకాశంలోకి ప్రయాణిస్తుంది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను నెటిజన్లు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. కామెంట్స్, షేర్లు చేస్తున్నారు. కొంతమంది గద్ద వేట మామూలుగా లేదని కామెంట్ చేశారు. మరి కొంతమంది డేంజర్ గద్ద అంటూ పోస్ట్ పెట్టారు. ఇంకొందరు గద్ద నైపుణ్యం సూపర్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఏది ఏమైనా గద్ద వేటాడిన తీరు అద్భతమని నెటిజన్లు కొనియాడుతున్నారు.
View this post on Instagram