హైదరాబాద్‌లో ఒక్క టీ రూ.1000.. అంత ధర ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

| Edited By: Anil kumar poka

Oct 16, 2021 | 5:01 PM

హైదరాబాద్‌లో నీలోఫర్ కేఫ్‌లో కప్పు టీని వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్న వార్త ఇప్పుడు ఆ నోటా, ఈ నోటా పడి అందరికీ చేరింది..

హైదరాబాద్‌లో ఒక్క టీ రూ.1000.. అంత ధర ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
Tea
Follow us on

హైదరాబాద్‌లో నీలోఫర్ కేఫ్‌లో కప్పు టీని వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్న వార్త ఇప్పుడు ఆ నోటా, ఈ నోటా పడి అందరికీ చేరింది. దీంతో అందులో అంత స్పెషల్ ఏముందా అంటూ టేస్ట్ చేసేందుకు అటువైపు దారితీస్తున్నారు నగరవాసులు. బంజారాహిల్స్‌లో తాజాగా ప్రారంభించిన ఈ కేఫ్‌ బ్రాంచ్ అత్యంత అరుదైన, ప్రత్యేకమైన ఈ టీని నగరవాసులకు పరిచయం చేసింది. ఈ తేనీటిని గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ పొడితో తయారుచేస్తారట. అందుకే దానికి అంత ధర!

అసోంలోని మైజాన్‌లో నిర్వహించిన వేలంలో కిలో టీ పొడిని 75వేల చొప్పున కొనుగోలు చేసి తీసుకొచ్చిన్నట్లు తెలిపారు నీలోఫర్‌ కేఫ్‌ నిర్వాహకులు. ఇంకా కేఫ్ దగ్గర మిగిలింది కేజిన్నర గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ పౌడర్ మాత్రమే. ఈ పౌడర్‌తో తయారుచేసే టీ ప్రత్యేకమైన, అరుదైన రుచిని ఇస్తుందని చెబుతున్నారు. వినియోగదారులకు ఈ సరికొత్త రుచిని అందించాలన్న ఉద్దేశంతోనే దీనిని పరిచయం చేసినట్టు వెల్లడించారు.

Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!

30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!

ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!