Andhra Pradesh: ప్రభుత్వ కార్యాలయం నుంచి వినిపించిన అరుపులు.. ఏంటోనని చూసి దెబ్బకు పరుగులు..
వైఎస్ఆర్ బీమా డిస్ట్రిక్ట్ మోనటరింగ్ యూనిట్.. పేదవారు ఎవరైనా మరణిస్తే.. వారికి సంబంధించి ఇన్సూరెన్స్ క్లయిమ్ కోసం ఆ కార్యాలయం పనిచేస్తుంటుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఈ మోనటరింగ్ యూనిట్లో పనిచేసే వారంతా మహిళా ఉద్యోగులే. సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో అంతా ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో కానీ ఆఫీస్‌లోకి
విజయనగరం, ఆగస్టు 6: అదోక ప్రభుత్వ కార్యాలయం.. అంతా బిజిబిజీగా ఉన్నారు.. సాయంత్రం అవ్వడంతో అందరూ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ సీన్ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. స్నేక్ రాజు.. అదేనండి పాము.. అది కూడా మాములు పాము కాదు.. నల్లత్రాచు.. దానిని చూసిన మహిళా ఉద్యోగులు భయంతో కార్యాలయం నుంచి పరుగులు తీశారు.. విజయనగరం జిల్లా మహిళ ప్రాంగణంలోని వైఎస్ఆర్ బీమా మోనటరింగ్ యూనిట్‌లో నల్ల త్రాచు పాము హల్ చల్ చేసిన ఘటన కలకలం రేపింది. అయితే, చివరకు ఏం జరిగింది..? అనే వివరాలను తెలుసుకోండి.. వైఎస్ఆర్ బీమా డిస్ట్రిక్ట్ మోనటరింగ్ యూనిట్.. పేదవారు ఎవరైనా మరణిస్తే.. వారికి సంబంధించి ఇన్సూరెన్స్ క్లయిమ్ కోసం ఆ కార్యాలయం పనిచేస్తుంటుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఈ మోనటరింగ్ యూనిట్లో పనిచేసే వారంతా మహిళా ఉద్యోగులే. సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో అంతా ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో కానీ ఆఫీస్‌లోకి ఓ పాము బుసలు కొడుతూ హల్ చల్ చేస్తూ వారి కంట పడింది. వెంటనే పామును గమనించిన డీపీఎం రాజ్యలక్ష్మీ చాకచక్యంగా వ్యవహరించి, సిబ్బందిని అప్రమత్తం చేసి ఆఫీస్ నుంచి బయటకు తీసుకువచ్చారు.
అయితే, కాల్ సెంటర్ లోకి పాము రావడంతో మహిళా సిబ్బంది భయంతో పెద్ద పెద్దగా కేకలు వేశారు. వారి అరుపులు విని ప్రక్కనే ఉన్న ఇతర ఆఫీసుల్లోని సిబ్బంది కూడా కాల్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. ఉద్యోగుల అరుపులతో పాము మరింత ఆగ్రహించి బుసలు కొట్టింది. ఇదంతా చూస్తున్న అక్కడ ఉన్న కొందరు సిబ్బంది పామును కొట్టి చంపే ప్రయత్నం చేశారు. అయితే, బుసలు కొడుతున్న పాము వద్దకు వెళ్లే ధైర్యం చేయలేక వెనక్కి తగ్గి స్నేక్ క్యాచర్‌కి సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ వచ్చే వరకు సిబ్బంది పామును గమనించారు.
అయితే, కాల్ సెంటర్లో పెద్ద పెద్ద బీరువాలు ఉండటంతో వాటి మధ్యలోకి ఎక్కడ వెళ్తుందో అని జాగ్రత్తగా గమనించారు. ఆ బీరువాల మధ్యలోకి పాము వెళ్తే ఆ పామును పట్టడం అత్యంత కష్టమైన పనే. బీరువాలు ఆఫీస్ నుండి బయటకు తీసుకురావడం ఒక్క పట్టాన అయ్యే పని కాదు. అలా ఏమి చేయాలో, ఎలా చేయాలో అని చర్చించుకుంటూ అంతా అయోమయంగా మారింది అక్కడి వాతావరణం. ఏదేమైనా పామును పట్టుకుంటే తప్పా మహిళలు తిరిగి లోపలకి వెళ్లి విధులు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో దానిని జాగ్రత్తగా గమనించారు.
ఇంతలో వచ్చిన స్నేక్ క్యాచర్ బుసలు కొడుతున్న పామును చాకచక్యంగా పట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలో బంధించడంతో సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..