China: కెనడాలో భారతీయుల సంఖ్యను చూసి చైనా మహిళ వ్యంగ్యంగా కామెంట్స్.. నెటిజన్లు షాకింగ్ రియాక్షన్..

డ్రైవింగ్ లైసెన్స్ కోసం పరీక్ష రాసేందుకు సెంటర్‌కు చేరుకున్న సన్ గ్లాసెస్ ధరించిన మహిళతో వీడియో ప్రారంభమవుతుంది. తన చుట్టూ కూర్చున్న భారతీయులను కెమెరాలో రికార్డ్ చేస్తూ.. 'తెలియనివాళ్లు నేను ఇండియాలో ఉన్నానని అనుకుంటారు. అయితే ఇది కెనడా. అంటూ ఇంకా ఆమె మాట్లాడుతూ, 'కెనడాలో ఎక్కడ చూసినా భారతీయులు ఉన్నారు. ఇది భయంకరం అంటూ షేర్ చేసిన ఈ క్లిప్ వెంటనే వైరల్ అయ్యింది. కొద్దిసేపటికే ఇంటర్నెట్ వినియోగదారుల్లో కొత్త చర్చ మొదలైంది.

China: కెనడాలో భారతీయుల సంఖ్యను చూసి చైనా మహిళ వ్యంగ్యంగా కామెంట్స్.. నెటిజన్లు షాకింగ్ రియాక్షన్..
Chinese Woman Reaction VideoImage Credit source: X/@iamyesyouareno
Follow us
Surya Kala

|

Updated on: Sep 27, 2024 | 5:29 PM

కెనడాలో పెద్ద సంఖ్యలో భారతీయులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన చైనా మహిళ రియాక్షన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగదారుల్లో కొత్త చర్చకు దారితీసింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం పరీక్ష రాసేందుకు సెంటర్‌కు చేరుకున్న సన్ గ్లాసెస్ ధరించిన మహిళతో వీడియో ప్రారంభమవుతుంది. తన చుట్టూ కూర్చున్న భారతీయులను కెమెరాలో రికార్డ్ చేస్తూ.. ‘తెలియనివాళ్లు నేను ఇండియాలో ఉన్నానని అనుకుంటారు. అయితే ఇది కెనడా. అంటూ ఇంకా ఆమె మాట్లాడుతూ, ‘కెనడాలో ఎక్కడ చూసినా భారతీయులు ఉన్నారు. ఇది భయంకరం అంటూ షేర్ చేసిన ఈ క్లిప్ వెంటనే వైరల్ అయ్యింది. కొద్దిసేపటికే ఇంటర్నెట్ వినియోగదారుల్లో కొత్త చర్చ మొదలైంది.

@iamyesyouarenoX హ్యాండిల్‌తో షేర్ చేసిన ఈ వీడియో చాలా ప్రజాదరణ పొందింది. ఇది ఇప్పటివరకు 27 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. రకరకాల కామెంట్ల వరద పోటెత్తుతోంది. కెనడాలో భారతీయుల సంఖ్యను చూసి ఓ చైనీస్ మహిళ ఆశ్చర్యపోయింది. కెనడా రోజురోజుకు కెనడియన్‌గా మారుతోంది. దీనిని అందరూ గమనిస్తున్నారని చెప్పింది. అంతేకాదు చైనీస్ మహిళ తాను భారతదేశంలో ఉన్నానని అనుకుంటారు.. అయితే ఇది కెనడా అంటూ కామెంట్ చేసింది.

ఇవి కూడా చదవండి

కెనడాలో భారతీయుల సంఖ్య చూసి చైనా మహిళ షాక్..

ఈ వీడియోపై ప్రజల నుండి మిశ్రమ స్పందనలువస్తున్నాయి. కెనడాలో భారతీయులు భారీ సంఖ్యలో ఉన్నారని చాలా మంది అంగీకరించారు.. అదే సమయంలో మరికొందరు చైనా జనాభా కూడా తక్కువ కాదని చెప్పారు. ఒకరు నేను అంగీకరిస్తున్నాను.. కెనడాలోని వాంకోవర్‌లో కూడా చాలా మంది చైనీయులు ఉన్నారు. చిన్న చైనా అని పిలుస్తూ ఇక్కడ గందరగోళానికి గురవుతారు. మరొకరు తాను 90లలో కెనడా వెళ్లినట్లు గుర్తుంది. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను అక్కడ చాలా మంది చైనీయులు ఎందుకు ఉన్నారని ఆలోచించినట్లు చెప్పారు. మూడవ వినియోగదారు, ‘ట్రూడో కొత్త భారతదేశం’ అని కామెంట్ చేశారు.

కొంచెం వింతగా అనిపిస్తున్న పిర్యాదు

అదే సమయంలో చాలా మంది వినియోగదారులు చైనీస్ మహిళ ప్రకటనలోని వ్యంగ్యాన్ని హైలైట్ చేశారు. ఒకరు ఒక చైనీస్ వలసదారు కెనడాలోని వలసదారులపై ఫిర్యాదు చేయడం కొంచెం వింతగా అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. మరొకరు బహుశా ఆ మహిళ చైనాకు తిరిగి వెళ్లవచ్చు’ అని రాశారు. మరొకరు కెనడా దేశంలోని వైవిధ్యం దేశాన్ని గొప్పగా చేస్తుంది. ఐరోపా, ఆసియా లేదా ఇతరులు కావచ్చు ఇదే కెనడా దేశం అందం అని కామెంట్ చేశాడు.

ఒక్క చూపులో వాస్తవాలు

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం కెనడాలో స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య 2013 నుంచి వేగంగా పెరుగుతోంది. అమెరికా యూనివర్శిటీల కంటే కెనడియన్ యూనివర్శిటీలకే విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదిక పేర్కొంది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) విశ్లేషణ ప్రకారం 2013 నుంచి 2023 మధ్య కెనడాకు వలస వచ్చిన భారతీయుల సంఖ్య 32,828 నుంచి 139,715కి పెరుగుతుందని అంచనా వేయబడింది. ఇది 326% పెరుగుదల నమోదు చేసిందని తెలుస్తోంది. గత రెండు దశాబ్దాల్లో కెనడియన్ విశ్వవిద్యాలయాలలో భారతీయుల నమోదు 5,800% కంటే ఎక్కువ పెరిగింది.

మరిన్ని టెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..