వైరల్‌గా మారిన చిన్నపిల్లలపై ‘ఛీజ్ ఛాలెంజ్’

వైరల్‌గా మారిన చిన్నపిల్లలపై ‘ఛీజ్ ఛాలెంజ్’

సోషల్ మీడియా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోన్న నేపథ్యంలో కొత్త కొత్త పేర్లతో రోజుకో ఛాలెంజ్‌ వైరల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో ‘ఛీజ్ ఛాలెంజ్’ పేరుతో చిన్నపిల్లలు, పెంపుడు జంతువులకు సంబంధించిన ఓ ఛాలెంజ్ వైరల్‌గా మారింది. ఐదు సంవత్సరాల లోపు పిల్లలు, పెంపుడు జంతువుల మొహం మీదికి ఉన్నట్లుండి చీజ్ వేస్తే దానికి వారు స్పందించే తీరును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాగా హంగ్‌ హోల్మ్స్‌ అనే వ్యక్తి ఒక వీడియోను పోస్ట్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 22, 2019 | 5:05 PM

సోషల్ మీడియా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోన్న నేపథ్యంలో కొత్త కొత్త పేర్లతో రోజుకో ఛాలెంజ్‌ వైరల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో ‘ఛీజ్ ఛాలెంజ్’ పేరుతో చిన్నపిల్లలు, పెంపుడు జంతువులకు సంబంధించిన ఓ ఛాలెంజ్ వైరల్‌గా మారింది. ఐదు సంవత్సరాల లోపు పిల్లలు, పెంపుడు జంతువుల మొహం మీదికి ఉన్నట్లుండి చీజ్ వేస్తే దానికి వారు స్పందించే తీరును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

కాగా హంగ్‌ హోల్మ్స్‌ అనే వ్యక్తి ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో ఏడుస్తున్న చిన్నపిల్లాడి మొహం మీదికి ఛీజ్‌ను విసిరారు. దానికి ఆ పిల్లాడి తీరు ఫన్నీగా ఉండటంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఆ తరువాత ఛీజ్డ్ పేరుతో ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన పలువురు తమ పిల్లలు, పెంపుడు జంతువులపై ప్రయోగించారు. దీంతో హంగ్ హోల్మ్స్ ఆ ట్వీట్ డిలీట్ చేస్తూ క్షమాపణలు చెప్పాడు. తాను పోస్ట్ చేసిన ఈ వీడియో ఇంత వైరల్‌గా మారుతుందని అనుకోలేదని.. దీనివలన ఆ పిల్లాడి కుటుంబ ప్రైవసీకి భంగం కలుగుతుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అయినా ఈ ఛాలెంజ్ మాత్రం ఆగలేదు.

అయితే దీనిపై కొంతమంది విమర్శలు కురిపిస్తున్నాయి. ఇలాంటి ఛాలెంజ్‌లు పిల్లలను మానసికంగా దెబ్బతీస్తాయి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఛీజ్ చాలెంజ్‌లకు పిల్లల హావభావాలు నవ్వును తెప్పిస్తున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu