AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: పెళ్లైనా మరో స్త్రీ కావాలని పురుషులు ఎందుకని కోరుకుంటారో తెల్సా.. కారణాలివే

ఎన్నో మతాలవారు వివాహాన్ని పవిత్ర బంధంగా పరిగణిస్తారని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. ఆడ, మగ ఇద్దరూ తమ బంధంలో నిజాయితీగా ఉండటమే కాకుండా.. ఓ చిన్న కుటుంబాన్ని కలిగి ఉన్నప్పుడే.. వారి జీవితం స్వర్గం అవుతుందని పెద్దల మాట.

Chanakya Niti: పెళ్లైనా మరో స్త్రీ కావాలని పురుషులు ఎందుకని కోరుకుంటారో తెల్సా.. కారణాలివే
Viral
Ravi Kiran
|

Updated on: Aug 22, 2024 | 12:00 PM

Share

ఎన్నో మతాలవారు వివాహాన్ని పవిత్ర బంధంగా పరిగణిస్తారని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. ఆడ, మగ ఇద్దరూ తమ బంధంలో నిజాయితీగా ఉండటమే కాకుండా.. ఓ చిన్న కుటుంబాన్ని కలిగి ఉన్నప్పుడే.. వారి జీవితం స్వర్గం అవుతుందని చాణక్య నీతిలో పేర్కొన్నాడు చాణక్యుడు. కానీ కొన్నిసార్లు పురుషులు వివాహం చేసుకున్నా.. మరొక మహిళతో సహవాసం కావాలనుకుంటారు. ఇది వివాహిత జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఈ సమయంలో స్త్రీ మేల్కొని తన భర్తను సరైన మార్గంలోకి తీసుకురాకపోతే కుటుంబం నాశనం అయినట్టే. మరి పెళ్లి తర్వాత కూడా పురుషుడి మనసు మరో స్త్రీ వైపు ఎందుకు మళ్లుతుందో.. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఆ కారణాలు ఏంటో తెలుసుకుందాం..

ఎర్లీ మ్యారేజ్:

ఎర్లీ మ్యారేజ్.. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని చెడగొడుతుంది. చిన్న వయస్సులో కెరీర్‌పై దృష్టి సారించే వ్యక్తి తన వ్యక్తిగత కోరికలపై ఎక్కువ దృష్టి పెట్టడు. వృత్తిలో స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు.. ఆ వ్యక్తి తన భార్యపై ఆసక్తి చూపించకపోవచ్చు. వాస్తవానికి పురుషులు తమ కోరికలను బట్టి స్త్రీల పట్ల ఆకర్షితులవుతారు అని చాణక్యుడు చెప్పాడు.

శారీరక సంతృప్తి లేకపోవడం:

వైవాహిక సంబంధంలో మానసిక సంబంధంతో పాటు శారీరక సంబంధం కూడా చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు శారీరక సంతృప్తి లేనప్పుడు పురుషుడు సహజంగానే మరో స్త్రీ సాంగత్యంలో పడిపోతాడని చాణక్యుడు చెప్పాడు. వైవాహిక బంధంలో శారీరక సంబంధం బాగాలేకపోతే భార్యాభర్తలు పరస్పరం మాట్లాడుకోవాలి. లేదంటే అది అనైతిక సంబంధాలకు దారి తీస్తుంది.

నమ్మకం లేకపోవడం:

భార్యాభర్తల మధ్య ఏర్పడే నమ్మకం.. వారి మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటేనే బంధం నిజాయితీగా ఉంటుంది. భర్త ప్రవర్తనపై భార్యకు అనుమానం ఉంటే, అలాగే భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం కలిగిస్తే.. వారిరువురి అనైతిక సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు.

తల్లిదండ్రులుగా మారడం:

సాధారణంగా భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ.. ఓ బిడ్డ పుట్టాక అది కనిపించకపోవచ్చు. ఆ సమయంలో భార్య తన భర్తపై తక్కువ శ్రద్ధ చూపించవచ్చు. భర్త కంటే భార్య బిడ్డకే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు.. అతడు వేరే స్త్రీని ఇష్టపడే అవకాశం ఉండొచ్చునని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.

చిన్న చిన్న విషయాలకే కలత చెందడం:

భార్యాభర్తలు కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే మనస్తాపానికి గురవుతారు. కొంతమంది పురుషులైతే తమ భాగస్వామిలో తప్పునే ఎత్తిపొడుస్తుంటారు తప్పితే.. ఆమెలోని మంచిని గ్రహించరు. చాణక్యుడు ప్రకారం, పురుషులు ఇతర స్త్రీలతో ప్రేమలో పడటానికి ఈ పగ, ద్వేషాలే కారణమవుతాయి.