Andrew Formica: తల్లిదండ్రులను చూసుకోవడానికి.. బీచ్‌లో గడపడానికి కోట్ల జీతం వచ్చే ఉద్యోగానికి గుడ్ బై చెప్పిన సీఈవో

|

Jun 30, 2022 | 1:20 PM

జీవితంలో ఇంతకంటే సాధించడానికి ఏమీలేదు.. ఇక నుంచి పెద్దవారినైనా తల్లిదండ్రులను చూసుకుంటూ.. బీచ్ లో జీవితాన్ని ఎంజాయ్ చేస్తానని.. కోట్ల రూపాయల జీతం వచ్చే ఉద్యోగానికి గుడ్ చెప్పారు.. జూపిటర్ సీఈవో ఆండ్రూ ఫార్మికా

Andrew Formica: తల్లిదండ్రులను చూసుకోవడానికి.. బీచ్‌లో గడపడానికి కోట్ల జీతం వచ్చే ఉద్యోగానికి గుడ్ బై చెప్పిన సీఈవో
Andrew Formica
Follow us on

Andrew Formica: డబ్భుల సంపాదన.. కోసం కన్న తల్లిదండ్రులను, ఉన్నఊరిని వదిలి.. దేశవిదేశాలకు యువత పయనం అవుతుంటే.. మరోవైపు తన తల్లిదండ్రులు పెద్దవారు అయ్యారు.. ఇక తాను ప్రశాంతమైన జీవితం గడపాలంటూ.. కోట్లు జీతాన్ని ఇచ్చే ఉద్యోగానికి గుడ్ బై చెప్పి.. సంచలనం సృష్టించారు ఓ కంపెనీ సీఈవో.. అవును పెద్ద వయస్కులైన తన తల్లిదండ్రుల్ని చూసుకోవటం కోసం 5లక్షల కోట్ల రూపాయల కంపెనీ సీఈవో పదవికి రిజైన్ చేశాడు. టెన్షన్ బతుకులు వదిలిపెట్టి తన లైఫ్‌ను కాస్త భిన్నంగా.. ప్రశాంతంగా గడపాలని  లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఫండింగ్‌ సంస్థ ‘జూపిటర్ ఫండ్ మేనేజ్‌మెంట్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆండ్రూ ఫార్మికా హఠాత్తుగా రాజీనామా చేశారు. ఇప్పుడీ వార్త కార్పొరేట్ ప్రపంచంలో షాకింగ్‌గా మారింది. జూపిటర్ ఫండ్ మేనేజ్ మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండ్రూ ఫార్మికా. ఇన్వెస్ట్ మేనేజ్ మెంట్ పరిశ్రమలో 27 ఏళ్లు అపార అనుభవం ఉన్న ఆండ్రూ ఫార్మికా ‘జూపిటర్ ఫండ్ మేనేజ్‌మెంట్ కంపెనీలో చేరడానికి ముందు.. US ఫండ్ కంపెనీ జానస్, UK-ఆధారిత హెండర్సన్ వంటి వివిధ సంస్థల్లో వివిధ స్థాయిల్లో పని చేశారు.

68 బిలియన్‌ డాలర్లు.. అంటే అక్షరాల 5 లక్షల కోట్లు రూపాయల సంపద కలిగిన జుపిటర్‌ సంస్థ బాధ్యతలను 2019లో చేపట్టిన ఆండ్రూ ఉన్నట్లుండి సంస్థకు రాజీనామా చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే సంస్థ నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. తన సీఈవో పదవికి రాజీనామా చేసిన వైనం విస్మయానికి కారణమైంది. అక్టోబరు ఒకటి నుంచి ఆయన తన పదవి నుంచి తప్పుకోనున్నట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని బ్లూమ్ బర్గ్ విషయాన్ని వెల్లడించింది. ఇకపై ఆయన మరే ఇతర సంస్థలోనూ చేరడం లేదని, కుటుంబంతో గడిపేందుకు, వ్యక్తిగతంగా బీచ్‌లో సేద తీరేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. ఆండ్రూ ఫార్మికా మూడు దశాబ్దాలుగా ఇంగ్లాండ్‌లోనే ఉన్నారు. అక్టోబర్‌ 1 తర్వాత స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులతో గడపనున్నారు. ‘బీచ్‌లో కూర్చొని ఏమీ చేయకుండా కాలక్షేపం చేయాలనుకుంటున్నా’ అని బ్లూమ్‌బర్గ్‌కు ఆండ్రూ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..