Viral Video: పిల్లికి సిక్స్‌ప్యాక్ ఫీవర్.. జిమ్‌కి వెళ్లి మరి చెమటోడ్చుతోంది.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు
Cat Viral Video: ఫిట్‌గా ఉండేందుకు చాలామంది జిమ్‌లల్లో తెగ కష్టపడుతుంటారు. గంటలకొద్ది ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ చెమటోడుస్తుంటారు. అయితే.. ఇక్కడ ఓ విచిత్ర సన్నివేశం తెరపైకి

Cat Viral Video: ఫిట్‌గా ఉండేందుకు చాలామంది జిమ్‌లల్లో తెగ కష్టపడుతుంటారు. గంటలకొద్ది ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ చెమటోడుస్తుంటారు. అయితే.. ఇక్కడ ఓ విచిత్ర సన్నివేశం తెరపైకి వచ్చింది. ఫిట్‌గా ఉండేందుకు కష్టపడే జంతువులను మీరు ఎప్పుడైనా చూసారా? అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఫిట్‌గా ఉండాలని ఆలోచిస్తుంటే.. తప్పకుండా ఈ ఫన్నీ వీడియోను చూస్తే.. మీకు కూడా ఆరోగ్యంపై దృష్టిపెట్టాలనిపిస్తుంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ పిల్లి హాయిగా పడుకుని పుష్ అప్స్ చేస్తుండటాన్ని మీరు చూడవచ్చు. ఈ మహమ్మారి సమయంలో పిల్లి తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియోలో పిల్లి వ్యాయామం చేసిన తీరును చూసి.. అందరూ తెగ ఇష్టపడుతున్నారు. వీడియో చూస్తుంటే పిల్లికి రోజూ వ్యాయామం, వ్యాయామాల పట్ల అవగాహన ఉన్నట్టు కనిపిస్తుంది. జిమ్‌లో పిల్లి హాయిగా పడుకొని.. పుష్ అప్స్ చేస్తూ.. ఫిట్నెస్‌పై దృష్టిపెట్టింది.. దానిలాగే మనం కూడా కష్టపడితే బాగుండు అని నెటిజన్లు పేర్కొంటున్నారు.
వైరల్ అవుతున్న ఈ 14-సెకన్ల వీడియోను చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోను @FighterAKR అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేసారు. ఈ వీడియోని ఎవరు చూస్తున్నా, మళ్లీ మళ్లీ చూడాలనిపించేంతగా ఉందంటూ పలు కామెంట్లు చేస్తూ.. లైక్ చేస్తున్నారు.
వైరల్ వీడియో..
This Cat also Knows the Benefits of Exercising..
???????????#Viral #ViralVideo #gym
Video By:- @pleasingnesss pic.twitter.com/o4bu1MoLeS
— Arijit K R0Y (@FighterAKR) November 29, 2021
ఈ వీడియోపై ఓ వినియోగదారుడు కామెంట్ చేస్తూ.. ‘పిల్లికి సిక్స్ ప్యాక్ ఫివర్ వచ్చినట్లుంది’ అంటూ పేర్కొన్నాడు. ఇప్పటివరకు వ్యాయామాలు తప్పుగా చేసే వ్యక్తులు ఈ వీడియోను చూస్తే మంచిదంటూ మరొక యూజర్ కామెంట్ రాశారు. ఈ వీడియో చూసిన తర్వాత జంతువులు కూడా ఫిట్‌గా ఉండేందుకు ఇష్టపడుతున్నాయంటూ నెటిజన్లు ఫన్నీ వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read: