Girl Humanity: రోడ్డుపై గర్భిణీ అవస్థలు..ముందుకురాని పెద్దలు, చలించి పోయిన చిన్నారి ఏం చేసిందంటే..!

Andhra Pradesh: అనంతపురం జిల్లాలో ఇంట్రస్టింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుత కాలంలో మనుషుల్లో మానవత్వం నశించిపోతోంది..

Girl Humanity: రోడ్డుపై గర్భిణీ అవస్థలు..ముందుకురాని పెద్దలు, చలించి పోయిన చిన్నారి ఏం చేసిందంటే..!
Child
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 07, 2021 | 9:58 AM

Andhra Pradesh: అనంతపురం జిల్లాలో ఇంట్రస్టింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుత కాలంలో మనుషుల్లో మానవత్వం నశించిపోతోంది అనుకున్న వేళ ఓ చిన్నారి చూపిన ఔదార్యం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఇంతక ఆటోలో ఆస్పత్రికి బయల్దేరిన నిండు గర్భిణికి మార్గ మధ్యలో అనుకోకుండా ఆటోకి రిపేర్‌ వచ్చింది..దాంతో డ్రైవర్‌ ఆటోను రోడ్డు పక్కకే ఆపేశాడు..కానీ, పాపం అప్పటికే ఆ గర్భిణీ పురిటి నొప్పులతో అల్లాడిపోతుంది..ఆమెను ఎలాగైన ఆస్పత్రికి తరలించేందుకు ఆటోడ్రైవర్‌ ప్రయత్నిస్తున్నాడు..రోడ్డుపై వచ్చేపోయే వాహనాలను ఆపి సాయ చేయాలని కోరుతున్నాడు..కానీ, అతనికి సహకరించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు..కనీసం ఏ ఒక్క వాహనదారుడు కూడా ఆగి చూడలేదు..

చివరకు ఓ కారులో తల్లిదండ్రులతో పాటు స్కూల్‌కి వెళ్తోన్న ఓ చిన్నారి, ఆటోలో ఉన్న మహిళను గమనించింది..వెంటనే ముందుకు వెళ్లిపోయిన కార్‌ని తిరిగి వెనక్కి రప్పించింది.. వెంటనే ఆ చిన్నారి కారు దిగివచ్చి ఆటోలో ఉన్న మహిళలను పరామర్శించింది..తన స్కూల్‌ బ్యాగ్‌లో ఉన్న వాటర్‌ బాటిల్ తెచ్చి ఆమెకు దాహం తీర్చింది..కానీ, పాపం ప్రసవ వేధనతో ఆ గర్బిణీ అవస్థపడుతుంది..ఏం చేయాలో తెలియని ఆ చిట్టి హృదయం గొప్ప సాయం చేసింది..వెంటనే కారులో ఉన్న తమవారిని పిలిచి..మహిళకు సాయం చేయాలని కోరింది.. ఆటో డ్రైవర్‌, కారులో ఉన్న వ్యక్తి ఇద్దరు కలిసి గర్భిణీని చేతులపై మోసుకోని కారులోకి తరలించారు..ఆ తర్వాత ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌ తన ఆటోను రిపేర్‌ చేయించున్నాడు..ఇదంతా సినిమా కాదు..అనంతపురం జిల్లాలో జరిగిన యదార్థ ఘటన..

అయితే, ఇదంతా స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది..డిసెంబర్‌ 2న ఈ ఘటన జరిగినట్లుగా తెలిసింది. ఇది చూశాకైన మనమంతా ఈ చిన్నారిని చూసి ఎంతో నేర్చుకోవాలన్నది మాత్రం వాస్తవం.

Also read:

Students Missing: సినిమాకు వెళ్లారని టీచర్ల మందలింపు.. నలుగు విద్యార్థుల అదృశ్యం.. తల్లిదండ్రుల ఆందోళన..

Vijayawada: విజయవాడపై నీలి చిత్రాల నీడలు.. వెలుగులోకి కీలక విషయాలు.. మరో ఐదుగురిపై కేసు

House on Moon: చంద్రుడిపై ఉన్న ఆ వింత ఆకారం ఏంటబ్బా.. వైరల్ అవుతున్న ఫోటోలు.. మిస్టరీని చేధించే పనిలో శాస్త్రవేత్తలు..!