Viral Video: వర్షం నీరున్న రోడ్డుపై దూసుకుపోతున్నారా.? ఎంత ప్రమాదమో చూడండి.
నాలుగు రోజుల నుంచి వర్షం ఓ రేంజ్‌లో దంచికొడుతోంది. హైదరాబాద్ మొదలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి. రోడ్లన్నీ నీటితో...
నాలుగు రోజుల నుంచి వర్షం ఓ రేంజ్‌లో దంచికొడుతోంది. హైదరాబాద్ మొదలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి. రోడ్లన్నీ నీటితో నిండి పోయాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు చోట్ల పలు ప్రమాద సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇదిలా ఉంటే వర్షం నీరు ప్రవహిస్తున్న రోడ్లపై వాహనాలు నడిపితే ఒకింత ప్రమాదం ఉన్నప్పటికీ మరోవైపు కిక్కు కూడా ఉంటుంది. అందుకే కొందరు వర్షపు నీరులో వేగంగా నడుపుతుంటారు. మరీ ముఖ్యంగా కార్లలో దూసుకుపోతుంటారు. కారే కదా ప్రమాదం ఏముంటుంది అన్నట్లు వేగంగా వెళ్తుంటారు. అయితే తడి రోడ్లపై కారు ప్రయాణం ఎంత ప్రమాదకరమో చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తోంది ఓ వీడియో. హైవేపై జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. నీటితో నిండి ఉన్న రోడ్డుపై ఓ కారు దూసుకొచ్చింది. అయితే సరిగ్గా నీటిలోకి రాగానే కారు టైర్ స్కిడ్ కావడంతో కారు ఒక్కసారిగా రోడ్డు అవతలా బోల్తా కొట్టింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
హైడ్రోప్లానింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది… గమనించి తక్కువ వేగంతో వెళ్లగలరు.
వాహనం స్కిడ్ అయ్యేలా మీ టైర్లు మరియు రహదారి మధ్య నీటి పొర ఏర్పడినప్పుడు హైడ్రోప్లానింగ్ జరుగుతుంది.
తడి రోడ్లపై వేగాన్ని తగ్గించండి & పట్టును ఉంచండి.#RoadSafety pic.twitter.com/GW9n7rXXB7
— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) July 26, 2023
అయితే ఇలా తడి రోడ్లపై కారు స్కిడ్ కావడాన్ని హైడ్రోప్లానింగ్ అంటారని పోలీసులు తెలిపారు. హైడ్రోప్లానింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గమనించి తక్కువ వేగంతో వేళ్లాలని సూచించారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘వాహనం స్కిడ్ అయ్యేలా మీ టైర్లు, రహదారి మధ్య నీటి పొర ఏర్పడినప్పుడు హైడ్రోప్లానింగ్ జరుగుతుంది. తడి రోడ్లపై వేగాన్ని తగ్గించండి & పట్టును ఉంచండి’ అని రాసుకొచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..