Optical illusion: మీరు జీనియస్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!
ఇవాళ్టి మన ఆప్టికల్ ఇల్యూషన్ కొంచం కష్టంగా ఉండబోతుంది. కానీ ఇష్టంగా పాల్గొని చూడండి ఈజీగా విన్ అవుతారు మీరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్ ను మీ ముందుకు తీసుకొచ్చాను. రెడీనా మరి మీరు.. నాదొక చిన్న సలహా మీ కుటుంబసభ్యులతో కలిసి ఈ టాస్క్ లో పాల్గొనండి కొంచం ఈజీ అవుతుంది. లేదు నేనే చేస్తాను అంటే మీ ఇష్టం ప్రయత్నించి చూడండి.

మీరు చూస్తున్న ఇమేజ్ లో ఒక చెరువు ఒడ్డున ఫిషర్ మ్యాన్ కుర్చీలో కూర్చుని వేట కోసం సిద్ధమవుతున్నాడు. సాధారణంగా ఇది సాదారణ దృశ్యంగా అనిపించొచ్చు. కానీ ఇది ఓ మిస్టరీలా ఉంటుంది. ఎందుకంటే ఫిషర్ మ్యాన్ కి తన వాడే ఫిషింగ్ హుక్ కనిపించడం లేదు. ఆ ఫిషింగ్ హుక్ ఎక్కడ పడిపోయిందో అర్ధం అవ్వక పాపం ఆగమవుతున్నాడు. హుక్ దొరికితే కానీ పని జరగదు. మరి మీరు కనిపెట్టగలరా..?
ఫిషర్ మ్యానక్ కి ఎక్కువ సమయం లేదు. అందుకే మన సహాయం అడుగుతున్నారు. మీరు ఫిషింగ్ హుక్ ని 6 సెకన్లలో కనిపెట్టాల్సి ఉంటుంది. మరోసారి ఇమేజ్ ని బాగా చూడండి.. కార్టూన్ స్టైల్ లో ఉన్న ఈ ఇమేజ్ లో ఓ పెద్ద చెరువు, పచ్చని గడ్డి, చుట్టుపక్కల పొడవాటి చెట్లు ఉన్నాయి. సూర్యరశ్మి ఈ ఫోటోని మరింత ఆకర్షణీయంగా చేసింది. నీటిలో బాతులు కూడా ఉన్నాయి. షిషర్ మ్యాన్ కుర్చీలో కూర్చుని వేట వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతని పక్కన లంచ్ బ్యాగ్ కూడా ఉంది. కానీ అసలు హుక్ మాత్రం కనిపించడం లేదు. అదే ఈ ఇమేజ్ లో మిస్టరీలా మారింది.

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ లు మన గమనించే శక్తిని పరీక్షించేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఇమేజ్ లు ఎప్పుడూ మనకు కావాల్సినవి వెంటనే చూపెట్టవు. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అన్నింటిలోనూ ఏదైనా దాగి ఉండే అవకాశం ఉంటుంది. ఫిషింగ్ హుక్ ఫిషర్ మ్యాన్ చుట్టే ఉంది.. కానీ కనిపెట్టలేకపోతున్నాడు.
మనం వెంటనే చూస్తే ఏమి కనిపించదు. కొంత సమయం తీసుకుని ఓపికతో ప్రశాంతంగా చూస్తే మనం కనిపెట్టగలుగుతాము. ఇది కేవలం కంటి చూపు పరీక్ష కాదు.. పేషన్స్ కి పరీక్ష కూడా. మనం ఎంతో ఓపికగా గమనించాలి. అప్పుడే ఫిషింగ్ హుక్ దొరుకుతుంది.
ఇలాంటి ఇల్యూషన్ చిత్రాలు కేవలం వినోదానికి మాత్రమే కాదు.. మన మానసిక సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు కూడా ఉపయోగపడతాయి. ఇవి మెదడుకు వ్యాయామంలా పనిచేస్తాయి. మన ఏకాగ్రత, గమనికా శక్తి పెరగడానికి సహాయపడతాయి.
ఇంతకీ మీరు ఫిషింగ్ హుక్ ని కనిపెట్టారా.. కనిపెడితే మీకు అభినందనలు. కనిపెట్టనివారు మరోసారి ప్రయత్నించండి. అయినా కనపడటం లేదంటే చింతించకండి. మీరు చూస్తున్న ఇమేజ్ లోనే హుక్ ఉంది. హుక్ ని రౌండ్ చేసి ఉంచాను వెళ్లి చూడండి.

