AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: లెట్స్ ట్రై.. 10 సెకన్లలో ఈ ఫోటోలో ‘250’ నెంబర్ కనిపెడితే మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లే!

లెట్స్ ట్రై గయ్స్.. మళ్లీ నెంబర్ పజిల్‌తో మీ ముందుకు వచ్చేశాం. మీ బుర్రకు పదునుపెడితే.. ఈ పజిల్ ఈజీగా కనిపెట్టొచ్చు.

Viral Photo: లెట్స్ ట్రై.. 10 సెకన్లలో ఈ ఫోటోలో '250' నెంబర్ కనిపెడితే మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లే!
Spot The Number1
Ravi Kiran
|

Updated on: Sep 05, 2022 | 12:05 PM

Share

లెట్స్ ట్రై గయ్స్.. మళ్లీ నెంబర్ పజిల్‌తో మీ ముందుకు వచ్చేశాం. మీ బుర్రకు పదునుపెడితే.. ఈ పజిల్ ఈజీగా కనిపెట్టొచ్చు. మీలో టన్నుల కొద్దీ దమ్మున్నట్లయితే.. 10 సెకన్లలో పజిల్ సాల్వ్ చేసేస్తారు. ఇటీవల చాలామంది ప్రతీ విషయాన్ని ఓ పజిల్‌లా తీసుకుంటున్నారు. తాము చేసే పనిలో కిక్కుండాలంటే.. ప్రతీ దానిలోనూ మనం సవాల్‌ను ఎదుర్కోవాల్సిందే. అందుకేనేమో ఈ మధ్య చాలావరకు ఇంటర్నెట్‌లో ఫోటో పజిల్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. నెట్టింట లభించే ఫన్ ఎలిమెంట్స్‌లో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. లేట్ ఎందుకు తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోన్న ఫోటో పజిల్ ఏంటో చూసేద్దాం పదండి.!

లెక్కలు మాస్టార్లూ.. ఈ ఆర్టికల్ చదివేవారిలో ఎంతమంది ఉన్నారో చెప్పాలి.! రోజూ అంకెలు చూసే వీళ్ళయితే ‘250’ నెంబర్‌ను క్షణాల్లో కనిపెట్టేస్తారు. పైన పేర్కొన్న ఫోటోను ఓసారి లుక్కేయండి.. మీకేం కనిపిస్తోంది.! ఠక్కున అందరూ కొన్ని నెంబర్స్ అని అంటారు. మీరు గెస్ చేసింది కరెక్టే.. అయితే ఆ నెంబర్స్ మధ్య ‘250’ నెంబర్ ఉంది. అది ఏ వరుసలో ఉందో మీరు గుర్తించాలి. 10 సెకన్లలో కనిపెడితే మీరే గ్రేట్. నూటికి 99 మంది ఈ పజిల్‌ను సాల్వ్ చేశారు. మరి మీ మెదడుకు కూడా పదునుపెట్టండి.. ఓసారి లక్ పరీక్షించుకోండి. మీవి డేగ కళ్లు అయితే.. ఫస్ట్ అటెంప్ట్‌లో గుర్తిస్తారు. ఒకవేళ మీకు సమాధానం ఎంతకూ దొరక్కపోతే కింద ఫోటో చూడండి.

Follow Us