Viral Photo: ఈ ఫోటోలో ఎన్ని జంతువులు దాగున్నాయో చెప్పగలరా.. 10 సెకన్లలో కనిపెడితే మీరే తోపు!
వైరల్ వీడియోలు, ట్రెండింగ్ ఫోటోలు, ఫోటో పజిల్స్.. ఇలా ప్రతీ రోజూ ఏదొక అంశం నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా ఆప్టికల్ ఇల్యూషన్..
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాకు దాసులవుతున్నారు. అటు ఫన్.. ఇటు క్రియేటివిటీ రెండూ కూడా సమపాళ్లతో ఉండేలా కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్న కంటెంట్ ఇంటర్నెట్‌లో దొరుకుతోంది. వైరల్ వీడియోలు, ట్రెండింగ్ ఫోటోలు, ఫోటో పజిల్స్.. ఇలా ప్రతీ రోజూ ఏదొక అంశం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ కోవలోనే తాజాగా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఓ వ్యక్తి మనస్తత్వాన్ని ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్ ద్వారా అంచనా వేయొచ్చునని సైకాలజిస్టులు అంటుంటారు. ఇక అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు మన కళ్లను అప్పుడప్పుడూ మోసం చేస్తుంటాయి.
పైన పేర్కొన్న ఫోటో చూసేందుకు యానిమేటెడ్ చిత్రంలా కనిపించినప్పటికీ.. అందులో కొన్ని జంతువులు దాగున్నాయి. అవి ఎక్కడున్నాయి.? ఎన్ని.? అన్నది కనుక్కోవాలి. మీకు అక్కడ ఓ తోడేలు మాత్రమే కనిపిస్తోంది కదూ.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఆ చిత్రంలో ఇంకా చాలా తోడేళ్లు దాగున్నాయి. మీ కళ్లను మభ్యపెట్టే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ప్రస్తుతం నెటిజన్లను తికమక పెడుతోంది. మరి మీరేం అంటారు. ఎన్ని తోడేళ్లు ఉన్నాయో చెప్పగలరా.? లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి.. లేదంటే ఆన్సర్ కోసం కింద ఫోటోను చూడండి..
Here is the answer.. pic.twitter.com/FTizLv7sii
— telugufunworld (@telugufunworld) April 27, 2022