Viral Video: వీరిద్దరి ప్రేమ మరో లెవల్.. ఆఫ్రికన్ గుర్రంతో ప్రేమలో పడ్డ బుడ్డొడు.. చివరకు..

చిన్న పిల్లలను చూస్తే ఎవరికైన ముద్దాడాలనిపిస్తుంది. కేవలం మనకే కాదు జంతువులకు కూడా ముచ్చటేస్తుంది. సోషల్ మీడియాలో చిన్నారిపై ముద్దుల వర్షం కురిపించే..

Viral Video: వీరిద్దరి ప్రేమ మరో లెవల్.. ఆఫ్రికన్ గుర్రంతో ప్రేమలో పడ్డ బుడ్డొడు.. చివరకు..
Horse Kissing A Toddler
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 28, 2022 | 12:33 PM

చిన్న పిల్లలను చూస్తే ఎవరికైన ముద్దాడాలనిపిస్తుంది. కేవలం మనకే కాదు జంతువులకు కూడా ముచ్చటేస్తుంది. సోషల్ మీడియాలో చిన్నారిపై ముద్దుల వర్షం కురిపించే కుక్కలను, కోతులను మనం ఇప్పటి వరకు చాలా సార్లు చూశాం. అలాంటి వీడియో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో హల్‌చల్(Viral Video) చేస్తోంది. ఇలాంటి వీడియోలను నెటిజన్లు తెగ ముచ్చటపడుతున్నారు. ఎవరైనా దీన్ని చూడటానికి ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు తమను అలరించే వారి హృదయాలను గెలుచుకునే అలాంటి వీడియోలను చూడటానికి ఇష్టపడతారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి బయటికి వచ్చింది. అందులో గుర్రం ఓ చిన్నారితో ప్రేమగా ముద్దులు పెట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో ఒకటి అందరి మనసులను దోచుకుంటోంది.

చిన్న పిల్లలు తమ ఇళ్లలో పెంపుడు జంతువుల మధ్య చాలా సరదాగా గడపడం సాధారణంగా కనిపిస్తుంది. ఈ సమయంలో చాలా సార్లు పెంపుడు జంతువులు వాటిని చూసుకోవడం మనం చూడవచ్చు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్న పిల్లాడితో గుర్రం ప్రవర్తిస్తున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

గుర్రాలు సాధారణంగా కొంత దూకుడుగా కనిపిస్తాయి. అవి కోపంతో చిన్న పిల్లవాడిని ఎత్తి.. ఒక్కసారిగా కొట్టగలదు. దీని వల్ల వారికి తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇవి కాకుండా గుర్రం ఆ చిన్నారిని ఎంతో ప్రేమగా కలుస్తుంది.

ఈ సమయంలో, గుర్రం పిల్లల నుదిటిపై ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. ఇది చూసి అందరి హృదయాలను కట్టిపడేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తను వ్రాసే సమయానికి మిలియన్ల మంది లైక్‌లతో పాటు 1 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన తర్వాత, యూజర్లు తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది యూజర్లు నేటి అత్యుత్తమ వీడియోగా ప్రకటించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి: Donald Trump: ట్రంప్‌ రోజూ 10 వేల డాలర్లు జరిమానా కట్టాలటా.. ఎందుకో తెలుసా?

Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్‌.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!