AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: విచిత్రం.. సింహంపై ఎటాక్ చేసిన గేదె.. బలమైన కొమ్ములతో కుమ్మేసింది

సింహాన్ని అడవికి రాజుగా పరిగణిస్తారు. దాని డాబు, దర్పం అలానే ఉంటుంది మరి. సింహం గర్జన వింటేనే.. మిగతా జంతువులు...

Viral Video: విచిత్రం.. సింహంపై ఎటాక్ చేసిన గేదె.. బలమైన కొమ్ములతో కుమ్మేసింది
Buffalo Vs Lion
Ram Naramaneni
|

Updated on: Aug 01, 2021 | 6:50 PM

Share

సింహాన్ని అడవికి రాజుగా పరిగణిస్తారు. దాని డాబు, దర్పం అలానే ఉంటుంది మరి. సింహం గర్జన వింటేనే.. మిగతా జంతువులు అన్నీ హడలెత్తిపోతాయి. సింహాల గృహలు ఉన్న ఏరియాలవైపు వెళ్లడానికి కూడా కనీసం సాహసించడు. నక్కి వేటాడటం, వెంటాడి చంపడం రెండూ సింహానికి తెలుసు. వన్స్ సింహం వేటాడాలని డిసైడ్ అయ్యిందంటే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అయితే సింహం వేరే జంతువు చేతిలో బాధితురాలు అవ్వడం చాలా రేర్. తాజాగా అలాంటి సీన్ సాక్షాత్కరించింది. నక్కి ఉన్న సింహాన్ని చూసి..  ఎగబడి వచ్చిన గేదె తన కొమ్ములతో దానిపై దాడి చేసింది.

ముందుగా వీడియో వీక్షించండి…

వీడియోలో ఒక అడవిలో గేదెల మంద ఒక చెట్టు నీడ కింద విశ్రాంతిగా నిలబడి ఉండటాన్ని మీరు చూడవచ్చు. అయితే సింహం ఆ పక్కనే నక్కి కాచుకు కూర్చుంది. దాన్ని గమనించిన ఓ గేదె నేరుగా సింహం వద్దకు వచ్చింది. ఒక్కసారిగా దాడి చేసి తన కొమ్ములతో ఎత్తి పడేసింది. దీంతో బిత్తరపోయిన సింహం అక్కడి నుంచి బ్రతుకు జీవుడా అంటూ పారిపోయింది. అయితే అది వయసు మళ్లిన సింహం కాబట్టి ఏం చెయ్యకుండా వెళ్లిపోయింది. అదే వయసులో ఉన్నది అయితే తన సత్తా చూపించేంది. ఈ షాకింగ్ వీడియోను ట్విట్టర్‌లో లైఫ్ అండ్ నేచర్ అనే అకౌంట్‌తో షేర్ చేయబడింది. నెటిజన్లు ఈ వీడియోను బాగా లైక్ చేస్తున్నారు. విభిన్న కామెంట్స్ పెడుతూ షేర్ చేస్తున్నారు.

Also Read: ఏపీలో కొత్తగా 2,287 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

వాట్సాప్‌లో శ్రద్ధా చాట్‌ పిక్స్ వైరల్.. ‘హార్ట్ సింబల్స్’తో సేవ్‌ చేసిన వ్యక్తి..?