AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సోదరితో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన వధువు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

Bride Dance Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. వైరల్ అయ్యే

Viral Video: సోదరితో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన వధువు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
Wedding Video
Shaik Madar Saheb
|

Updated on: Jan 02, 2022 | 11:21 AM

Share

Bride Dance Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. వైరల్ అయ్యే వీడియోల్లో పెళ్లికి సంబంధిచినవి చాలానే ఉంటాయి. ఇటీవల వెడ్డింగ్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోల్లో వధువరుల ఆశ్చర్యపోయే దృశ్యాలు, డ్యాన్సులు ఉంటే.. మరికొన్ని వాటిల్లో పొట్టచెక్కలయ్యే ఫన్నీ సన్నివేశాలుంటాయి. ఇవి వేలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో తెగవైరల్ అవుతోంది. దీనిలో వధువుతోపాటు.. ఆమె సోదరి అందంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో తెగ ఆకట్టుకుంటోంది. ఇది చూసి నెటిజన్లు అమెజింగ్ అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇంటర్నెట్‌లో క్రేజీగా మారిన వైరల్‌ మారిన ఈ వీడియోలో సారా అలీ ఖాన్ చిత్రం అత్రంగి రేలోని చకా చక్‌ పాటకు డ్యాన్స్ చేశారు. వధువు, ఆమె సోదరి గాగ్రా డ్రెస్‌లో అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఇద్దరూ.. చేస్తున్న డ్యాన్స్, వారు వేసే స్టెప్పులు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

వైరల్ వీడియో..

ఈ వీడియో క్లిప్‌ను ‘theweddingministry’ అనే పేజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిని వేలాది మంది వీక్షించి.. లైక్‌ చేస్తున్నారు. వారిద్దరూ చకా చక్ పాటకు.. అద్భుతమైన స్టెప్పులేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Mahesh Babu: మహష్‌ క్రేజ్‌కు ఇది మరో ఉదాహరణ.. ఇండియాలో ఏ హీరోకు దక్కని ఘనతను సాధించిన సూపర్‌ స్టార్‌..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సంక్రాంతి బరిలో నిలవడం లేదా.? దానికి ఇదే నిదర్శనమా..