Viral Video: ‘తగ్గేదేలే’.. వరదలో వధువును ఎత్తుకుని పెళ్లి వేడుకకు తీసుకెళ్లిన వరుడు.. వీడియో వైరల్!
వర్షాలైనా, వరదలైనా 'తగ్గేదేలే' అంటున్నాడు వరుడు. వధువును ఎత్తుకుని మరీ వరదనీటిలో నడుచుకుని మండపానికి తీసుకెళ్లాడు. ఈ ఘటన మహారాష్ట్రలో..
వర్షాలైనా, వరదలైనా ‘తగ్గేదేలే’ అంటున్నాడు వరుడు. వధువును ఎత్తుకుని మరీ వరదనీటిలో నడుచుకుని మండపానికి తీసుకెళ్లాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకోగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం మహారాష్ట్రలోని పలు నగరాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నదులన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి. దీనితో అనేక ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. పెళ్లిళ్లు, వివిధ కార్యక్రమాలన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఈ తరుణంలో ఓ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు నిర్ణయించుకున్నారు. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముహూర్తం కూడా ఖరారైంది. అయితే ఈలోపే ఆ ప్రాంతానికి వరదలు ముంచెత్తాయి.
అన్నీ పూర్తయ్యాక పెళ్లి వాయిదా వేయడం ఎందుకని ఆ ప్రేమ జంట వినూత్న ప్రయోగం చేశారు. వరద నీటిలోనే పరిమిత సంఖ్యతో బంధువులను తరలించారు. వధూవరులు కూడా పెళ్లి మండపానికి చేరుకున్నారు. దీనితో అనుకున్న ముహూర్తానికి జూలై 26న పెళ్లి జరిగింది. ఇప్పుడు ఆ పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వధూవరులు బోట్‌లో వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.!