Brain Teaser: మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఈ ఫొటోలో ‘C’ని కనిపెట్టండి చూద్దాం..

సాధారణంగా ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలు సాల్వ్‌ చేయడంలో చాలా ఎగ్జైట్‌మెంట్‌ ఉంటుంది. కళ్లకు కనిపించినట్లే కనిపిస్తూ కనిపించకుండా ఉండే అంశాలు ఆసక్తిని పెంచుతుంటాయి. ప్రస్తుతం వైరల్‌ అవుతోన్న ఫొటో అలాంటిదే. పై ఫొటో చూడగానే సహజంగా అందరికీ 'O' అక్షరం కనిపిస్తోంది కదూ! అయితే 'O'ల మధ్యలోనే 'C' అక్షరం కూడా దాగి ఉంది...

Brain Teaser: మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఈ ఫొటోలో 'C'ని కనిపెట్టండి చూద్దాం..
Optical Illusion
Follow us
Narender Vaitla

|

Updated on: May 24, 2024 | 3:24 PM

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఆప్టికల్‌ ఇల్యూజన్‌ సంబంధిత ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. వీటిలో కంటి ఆలోచన శక్తిని పరీక్షించేవి కొన్ని అయితే కంటి పవర్‌ను పరీక్షించేవి మరికొన్ని ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ బ్రెయిన్‌ టీజర్‌ నెటిజన్లకు సవాల్‌ విసురుతోంది.

సాధారణంగా ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలు సాల్వ్‌ చేయడంలో చాలా ఎగ్జైట్‌మెంట్‌ ఉంటుంది. కళ్లకు కనిపించినట్లే కనిపిస్తూ కనిపించకుండా ఉండే అంశాలు ఆసక్తిని పెంచుతుంటాయి. ప్రస్తుతం వైరల్‌ అవుతోన్న ఫొటో అలాంటిదే. పై ఫొటో చూడగానే సహజంగా అందరికీ ‘O’ అక్షరం కనిపిస్తోంది కదూ! అయితే ‘O’ల మధ్యలోనే ‘C’ అక్షరం కూడా దాగి ఉంది. ఆ అక్షరాన్ని కనిపెట్టడమే ఈ బ్రెయిన్‌ టీజర్‌ ముఖ్య ఉద్దేశం.

Optical Illusion

 

అయితే కేవలం 6 సెకండ్లలో ‘C’ని కనిపెట్టాలనే కండిషన్‌ కూడా ఉందడోయ్‌. అయితే ఫొటోలో అన్ని అక్షరాలు ఒకేలా కనిపిస్తున్నాయి. ‘C’ ఎక్కడుందని అనుకుంటున్నారు కదూ! అయితే సరిగ్గా గమనిస్తే కనిపిస్తుంది. ఓసారి ట్రై చేసి చూడండి ‘C’ అక్షరం కనిపిస్తుందేమో.

ఎంత ట్రై చేసినా పజిల్‌ను సాల్వ్‌ చేయలేకపోతున్నారా.? అయితే ఓసారి పైన నుంచి ఏడవ లైన్‌ను జాగ్రత్తగా గమనించండి. అదే లైన్‌ చివరి నుంచి నాలుగో స్థానంలో మీరు కనిపెట్టాల్సిన అక్షరం దాగి ఉంది. ఇంత క్లూ ఇచ్చిన తర్వాత కూడా అక్షరాన్ని గుర్తించలేకపోతే ఓసారి సమాధానం కోసం కింద చూడండి. అదండి ఈ బ్రెయిన్ పజిల్‌ ఆన్సర్‌. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బ్రెయిన్‌ టీజర్‌ ఫొటోను మీ ఫ్రెండ్స్‌కి షేర్‌ చేసి వారి ఐ పవర్‌ను టెస్ట్ చేయండి.

Optical Illusions

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..