AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగపూర్‌ మహిళను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఇండియన్‌..! జైల్లో వేసిన పోలీసులు.. అసలు కథేంటంటే..?

సింగపూర్‌లో 49 ఏళ్ల వైతియలింగం ముత్తుకుమార్ అనే భారతీయుడు తన సహోద్యోగిని రహస్యంగా వివాహం చేసుకున్నందుకు మూడు నెలల మూడు వారాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మొదటి భార్యతో వివాహబంధంలో ఉన్నా రెండో వివాహం చేసుకోవడం, శాశ్వత నివాసం కోసం తప్పుడు సమాచారం అందించడం అతనికి శిక్షకు కారణం.

సింగపూర్‌ మహిళను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఇండియన్‌..! జైల్లో వేసిన పోలీసులు.. అసలు కథేంటంటే..?
Couples
SN Pasha
|

Updated on: Aug 24, 2025 | 8:10 AM

Share

సింగపూర్‌లో ఒక భారతీయ వ్యక్తి తన సహోద్యోగిని రహస్యంగా వివాహం చేసుకున్నందుకు మూడు నెలల మూడు వారాల జైలు శిక్షకు గురయ్యాడు. 49 ఏళ్ల వైతియలింగం ముత్తుకుమార్ అనే వ్యక్తి సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకోవడమే అతన్ని కటకటాల్లోకి నెట్టింది. మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడం అనేది సింగపూర్‌లో నేరం. అయితే ఇక్కడ కేవలం రెండో పెళ్లి మాత్రమే కాదు.. కుట్రపూరితంగా సింగపూర్‌ మహిళను రెండో పెళ్లి చేసుకొని శాశ్వత నివాసం కోసం దాఖలు చేసిన దరఖాస్తులో తనకు వేరే వివాహాలు లేవని తప్పుగా ప్రకటించాడని ఒక అభియోగాన్ని అంగీకరించాడు.

ముత్తుకుమార్ తన మొదటి భార్య 55 ఏళ్ల సింగపూర్ మహిళను 2007లో భారతదేశంలో వివాహం చేసుకున్నాడు. 2011లో తన మొదటి భార్యతో కలవడానికి సింగపూర్ వచ్చిన తర్వాత అతను తన సల్మా అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. సింగపూర్‌కు చెందిన 43 ఏళ్ల సల్మా బీ అబ్దుల్ రజాక్‌కు ముత్తుకుమార్‌ వివాహితుడని తెలిసినప్పటికీ ఆమె కూడా అతనితో ప్రేమను కొనసాగించింది. వివాహం తర్వాత తన మొదటి భార్యకు విడాకులు ఇస్తానని సల్మాకు ముత్తుకుమార్‌ హామీ ఇచ్చాడు. ఆగస్టు 2022లో ఈ జంట ముస్లిం పద్ధతిలో వివాహం చేసుకున్నారు. దీనిని భారతదేశంలోని నాగూర్‌లో ఒక మత నాయకుడు నమోదు చేశారు.

ముత్తుకుమార్, సల్మాతో సింగపూర్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా తన మొదటి భార్యతోనే ఉన్నాడు, కానీ సల్మాను కలవడం కొనసాగించాడు. సెప్టెంబర్ 14, 2023న సల్మా ఒక కొడుకుకు కూడా పుట్టాడు. అయితే ఆ బిడ్డ పుట్టిన ఆసుపత్రిలోనే అతని మొదటి భార్య పని చేస్తుండటంతో అతని రెండో పెళ్లి విషయం బయటపడింది. ఆ తర్వాత జూన్ 12, 2024న ముత్తుకుమార్ సింగపూర్ పౌరుడి జీవిత భాగస్వామిగా శాశ్వత నివాసి హోదా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. చట్టపరమైన ఫారమ్‌లలో ముత్తుకుమార్ తనకు వేరే వివాహాలు లేవని తప్పుగా ప్రకటించాడు. కానీ, విచారణలో అతని రెండు పెళ్లిళ్ల గురించి అధికారులకు తెలిసింది. ముత్తుకుమార్‌పై కేసు నమోదు చేసి అతనికి జైలు శిక్ష విధించాడు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి