Telugu News Trending Bear playing with slide video was gone viral in social media Telugu News
Video Viral: చిన్న పిల్లల్లా మారిపోయిన క్రూర జంతువు.. జారుడు బల్లపై ఎక్కి ఆడుకుంటున్న ఎలుగు..
అడవిలో చాలా రకాల జంతువులు ఉంటాయి. వాటిలో మచ్చిక చేసుకునేవి, క్రూరమైనవి ఉన్నాయి. సింహం, పులులు, ఎలుగుబంట్లు వంటి వాటిని ప్రమాదకర జంతువులుగా భావిస్తుంటారు. కానీ కొన్ని సార్లు అవి చేసే పనులు ఆనందాన్ని..
అడవిలో చాలా రకాల జంతువులు ఉంటాయి. వాటిలో మచ్చిక చేసుకునేవి, క్రూరమైనవి ఉన్నాయి. సింహం, పులులు, ఎలుగుబంట్లు వంటి వాటిని ప్రమాదకర జంతువులుగా భావిస్తుంటారు. కానీ కొన్ని సార్లు అవి చేసే పనులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వీటిని చూసిన తర్వాత నవ్వు రావడంతో పాటు ఆశ్చర్యం కలగకమానదు. మనుషుల్లాగే జంతువులు కూడా సరదాగా ఉంటాయి. ప్రతి జంతువుకు తనదైన ప్రపంచం ఉంటుంది. చిన్న పిల్లలకు జారుడు బల్లలు అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం. పార్కులో అవి కనిపిస్తే చాలు వెంటనే ఎక్కి ఆడేస్తుంటారు. రయ్యిమని జారుకుంటూ ఆనందంగా గడుపుతుంటారు. ఇవన్నీ చిన్నారులు చేయడం సహజమే. కానీ అడవిలో ఉండే క్రూర మృగాలు ఇఠలా చేస్తాయా.. చేస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.. లేదా అయితే ఈ వీడియో చూసేయండి. వైరల్ అవుతున్న వీడియోలో మంచు ప్రాంతంలో ఒక జారుడుబల్ల ఉంటుంది. దానిపై ఎలుగుబంటి ఆనందంతో ఎక్కుతుంది, దానిపై నుంచి జారడాన్ని చూడవచ్చు. కింద పడిపోకుండా పక్కా ప్లాన్ తో తనను తాను కంట్రోల్ చేసుకుంటూ చిన్నపిల్లల్లా ఆడుకుంటూ మురిసిపోయింది.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విటర్‌లో పోస్ట్ అయింది. చిన్నపిల్లలా స్లైడ్‌పైకి వెళ్లి, ఆ తర్వాత సరదాగా జారుతున్నట్లు కనిపిస్తుంది. ఇది చూస్తే చిన్న పిల్లలు గుర్తుకు రావడం మాత్రం పక్కా. వైరల్ అవుతున్న ఈ క్లిప్ ను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. వీడియోను వేల మంది లైక్ కూడా చేశారు. కామెంట్ల ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.