పురుడు సమయంలో దారుణం

Vijay K

Vijay K |

Updated on: Mar 21, 2019 | 10:24 AM

చెన్నై: డాక్టర్లు సరైన సమయానికి అందుబాటులో లేకపోవడంతో నర్సులు ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. కానీ అది దారుణానికి కారణమైంది. తమిళనాడులోని కవత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్‌లో పురుడు పోస్తున్న సమయంలో గర్భాశయం నుంచి కొద్దిగా బయటకు వచ్చిన శిశువు తలను పట్టుకుని నర్సులు బలంగా లాగారు. దీంతో మొండెం నుంచి తల వేరైపోయి చేతిలోకి వచ్చేసింది. మిగిలిన దేహం గర్భాశయంలోనే ఉండిపోయింది. దీంతో నర్సులు ఒక్కసారిగా భయపడిపోయి వెంటనే ఆస్పత్రి వైద్యులకు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. […]

పురుడు సమయంలో దారుణం

చెన్నై: డాక్టర్లు సరైన సమయానికి అందుబాటులో లేకపోవడంతో నర్సులు ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. కానీ అది దారుణానికి కారణమైంది. తమిళనాడులోని కవత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్‌లో పురుడు పోస్తున్న సమయంలో గర్భాశయం నుంచి కొద్దిగా బయటకు వచ్చిన శిశువు తలను పట్టుకుని నర్సులు బలంగా లాగారు. దీంతో మొండెం నుంచి తల వేరైపోయి చేతిలోకి వచ్చేసింది. మిగిలిన దేహం గర్భాశయంలోనే ఉండిపోయింది. దీంతో నర్సులు ఒక్కసారిగా భయపడిపోయి వెంటనే ఆస్పత్రి వైద్యులకు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.

కుటుంబ సభ్యులు వెంటనే తల్లిని చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. లోపలే ఉండిపోయిన మిగిలిన శిశువు శరీరాన్ని వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. విధులకు హాజరుకాని వైద్యులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu