Viral Video: పోరుకు కాలుదువ్విన ఏనుగు అడవి దున్న.. చివరకు ఎవరు గెలిచారంటే..
మనం నిత్యం మనుషుల మధ్య వైరం చూస్తూ ఉంటాం.. సోషల్ మీడియా పుణ్యమా అని జంతువుల మధ్య వైరంకు సంబంధించిన వీడియోలు నిత్యం మన ఫోన్ లో తారసపడుతూనే ఉంటాయి.

Viral Video: మనం నిత్యం మనుషుల మధ్య వైరం చూస్తూ ఉంటాం.. సోషల్ మీడియా పుణ్యమా అని జంతువుల మధ్య వైరంకు సంబంధించిన వీడియోలు నిత్యం మన ఫోన్ లో తారసపడుతూనే ఉంటాయి. గొడవకు దిగితే మనుషులైన జయింతువులైనా భీకర యుద్ధం తప్పదు. తాజాగా రెండు జంతువులు గొడవకు దిగిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తేటగా చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో గొడవకు కాలుదువ్విన జంతువులు ఏంటంటే.. ఓ ఏనుగు పిల్ల అలాగే అడవి దున్న. తన పై దాడి చేయడానికి వచ్చిన అడవి దున్నను ఏనుగు పిల్ల ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కొంది.
పచ్చిక బైళ్ళలో ఉన్న ఓ ఏనుగు పిల్ల దగ్గరకు ఓ అడవి దున్న వచ్చింది. ఆ ఏనుగు పిల్ల పై దాడి చేయడానికి ఆ అడవి దున్న సిద్ధం అయ్యింది. అది గమనించిన ఆ ఏనుగు పిల్ల ఏమాత్రం భయపడకుండా దానికి ఎదురుగా నిలబడింది. ఆతర్వాత ఏనుగు దూరంగా అడవి దున్నను చూసి దాని వైపు పరుగెత్తింది. అయితే నేరుగా దాడి చేయకుండా దాని ముందువరకు వెళ్లి అక్కడే ఉన్న పొందాలలోంచి వెళ్లి దాని ముందు నిలబడింది. దాంతో ఆ అడవి దున్న ఏనుగు పిల్ల భయపడటం లేదని గమనించింద అంతే కాదు దాడి చేయడానికి కూడా అది సాహింసించలేదు. మనకెందుకొచ్చిందిలే అన్నట్టుగా అక్కడి నుంచి మెల్లగా జారుకుంది ఆ అడవి దున్న. ఇప్పుడు ఈవీడియో వైరల్ అవుతుంది. అడవిదున్న ఎదురుగా ఉన్న ఆ ఏనుగు పిల్ల ఏమంత్రం భయపడకుండా దైర్యంగా దానిపై దాడికి ప్రయత్నించాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను నీలగిరికి చెందిన కిషోర్ చంద్రన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
??tusker & Indian Gaur at one frame.?? Vc – saran ?? pic.twitter.com/I2uS0oQ5Iu
— Kishore Chandran?? (@Kishore36451190) February 16, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :