- Telugu News Photo Gallery Cinema photos Malayalam Actress Bhavya Trikha Stunning Saree Photos Goes Viral In Social Media
Bhavya Trikha: చీరకట్టులో ఆ అందమే వేరబ్బా.. ఈ నెరజాణ సొగసుకు అల్లాడిపోవా హృదయాలు.
ఒకే ఒక్క సినిమాతో ఒవర్ నైట్ స్టార్స్ అయినపోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. సూపర్ హిట్ అందుకుని.. అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్నప్పటికీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. అందం, అభినయంతో సోషల్ మీడియాలోనూ ఏలేస్తుంది ఈ వయ్యారి.
Updated on: Mar 18, 2025 | 4:21 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్స్ హృదయాలను కట్టిపడేస్తుంది ఓ హీరోయిన్. చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తూనే మెస్మరైజ్ చేస్తుంది. ఒకే ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల గుండెలను దొచేసిన ఈ వయ్యారిని గుర్తుపట్టారా.. ? తనే హీరోయిన్ భవ్య త్రిఖ.

మలయాళీ బ్యూటీ భవ్య త్రిఖ. తెలుగు, తమిళం, మలయాళం ప్రేక్షకులకు సుపరిచమైన హీరోయిన్. జ్యో సినిమాతో ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ మూవీతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

తమిళంలో విడుదలైన జ్యో సినిమాను ఇటు తెలుగులోనూ డబ్ చేశారు. అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ మూవీలో రియో రాజ్ సరసన భవ్య త్రిఖ నటించింది. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది.

అయితే జ్యో సినిమా తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. కానీ మలయాళంలో మాత్రం అవకాశాలు క్యా కట్టాయి. ప్రస్తుతం అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది భవ్య.

అలాగే అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడూ మోడ్రన్ దుస్తులలోనే కాకుండా చీరకట్టులో, లంగావోణిలో ఫోటోస్ షేర్ చేస్తూ కట్టిపడేస్తుంది భవ్య. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.




