AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ.. మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు..’’: ప్రధాని మోదీ

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహోద్యోగి బుచ్ విల్మోర్ అంతరిక్ష నౌక భూమికి తిరిగి వస్తోంది. ఈ నేపథ్యంలోనే సునీతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక లేఖ రాశారు. క్షేమంగా భూమికి చేరుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని, ఆ వెంటనే భారతదేశానికి రమ్మని ఆహ్వానించారు. ల్యాండింగ్‌కు అనుకూలమైన వాతావరణాన్ని నాసా నిర్ధారించింది.

‘వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ.. మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు..’’: ప్రధాని మోదీ
Pm Modi, Sunitha Williams
Balaraju Goud
|

Updated on: Mar 18, 2025 | 4:28 PM

Share

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలలు గడిపిన తర్వాత నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రాబోతున్నారు. ISSలో చిక్కుకుపోయిన సునీత, విల్మోర్‌లతో స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ క్రూ-9 బయలుదేరింది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత, సునీత విలియమ్స్ త్వరలో భారతదేశానికి రావచ్చు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు సునీత విలియమ్స్‌కు ఒక లేఖ రాశారు. క్షేమంగా భూమికి చేరుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని, ఆ వెంటనే భారతదేశానికి రమ్మని ఆహ్వానించారు.

ప్రధాని మోదీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖలో ‘మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, మా హృదయాలకు చాలా దగ్గరగా ఉన్నారు’ అని ప్రధాని మోదీ రాశారు. ‘సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావాలని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ భారతమాత బిడ్డ కోసం అతృతగా ఎదురుచూస్తున్నారు’ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు.

మార్చి 1న ప్రధాని మోదీ సునీతా విలియమ్స్‌కు ఈ లేఖ రాశారు. ఇందులో ప్రధానమంత్రి, ‘భారత ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఒక కార్యక్రమంలో ప్రముఖ వ్యోమగామి మైక్ మాసిమినోను కలిశాను. సంభాషణ సమయంలో సునీత పేరు ప్రస్తావనకు వచ్చింది. సునీత గురించి, ఆమె పని గురించి ఎంత గర్వపడుతున్నామో చర్చించుకున్నాము. దీని తర్వాత లేఖ రాయకుండా ఉండలేకపోయాను.’’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , మాజీ అధ్యక్షుడు బిడెన్‌ను కలిసినప్పుడల్లా, సునీత గురించి అడిగేవాడినని. మీ విజయాల పట్ల 140 కోట్ల మంది భారతీయులు ఎల్లప్పుడూ గర్వపడుతున్నారు. ఇటీవలి సంఘటనలు మీ స్ఫూర్తిదాయకమైన దృఢ సంకల్పాన్ని గుర్తు చేశాయి. భారత ప్రజలు మీ ఆరోగ్యం కోసం, మిషన్ విజయం కోసం ప్రార్థిస్తున్నారు. అంటూ ప్రధాని రాసిన లేఖలో పేర్కొన్నారు.

‘‘మీ తల్లి బోనీ పాండ్యా మీరు సురక్షితంగా తిరిగి రావడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, దివంగత దీపక్ భాయ్ ఆశీస్సులు కూడా మీకు ఉన్నాయని పూర్తిగా నమ్మకం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాశారు. 2016లో అమెరికా పర్యటనలో మీతో పాటు ఆయనను కలిశాను. మీరు అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నాము. భారతదేశ గొప్ప కుమార్తెకు ఆతిథ్యం ఇవ్వడం భారతదేశానికి సంతోషకరమైన విషయం.’’ అంటూ ప్రధాని మోదీ రాశారు. ఈ లేఖలో, ప్రధాని మోదీ సునీతా విలియమ్స్ భర్త మైఖేల్ విలియమ్స్‌ను కూడా అభినందించారు. సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్మోర్ సురక్షితంగా తిరిగి రావాలని ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..