Anant – Radhika Marriage: అమ్మో ఇది విన్నారా.. అనంత్ అంబానీ వివాహంలో 2500 వంటకాలంట!
దిగ్గజ బిజినెస్ మ్యాన్ ముఖే అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహా వేడుకలు మొదలయ్యాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం ఈ ఏడాది 'వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్'గా నిలవనుంది. అంబానీ - రాధికా మర్చంట్‌ల వివాహం జులై నెలలో ఘనంగా జరగనుంది. జులై 12న జరగాల్సిన పెళ్లి వేడుకకు.. ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలైపోయాయి. చిన్న కుమారిడి పెళ్లిని ఏ మాత్రం తగ్గకుండా ఎంతో ఆర్భాటంగా చేస్తున్నారు ముఖేష్ అంబానీ. మార్చి 1వ తేదీ..
దిగ్గజ బిజినెస్ మ్యాన్ ముఖే అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహా వేడుకలు మొదలయ్యాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం ఈ ఏడాది ‘వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్’గా నిలవనుంది. అంబానీ – రాధికా మర్చంట్‌ల వివాహం జులై నెలలో ఘనంగా జరగనుంది. జులై 12న జరగాల్సిన పెళ్లి వేడుకకు.. ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలైపోయాయి. చిన్న కుమారిడి పెళ్లిని ఏ మాత్రం తగ్గకుండా ఎంతో ఆర్భాటంగా చేస్తున్నారు ముఖేష్ అంబానీ. మార్చి 1వ తేదీ నుంచి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలు కానున్నాయి. గుజరాత్ జామ్ నగ్‌లోని గ్రాండ్ రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు వందలాది మంది అంతర్జాతీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
గ్రాండ్‌గా గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు..
అనంత్ – రాధికా పెళ్లికి విచ్చేయుచున్న గెస్టులకు అదిరిపోయే విందు అందించనున్నారు ముఖేష్ అంబానీ. వారి ప్రెస్టేజ్‌కి ఏమాత్రం తగ్గకుండా.. ఏకంగా 2,500 వంటకాలు సిద్ధం చేయిస్తున్నారట. అంబానీ, రాధిక మర్చంట్‌ల గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఆహ్వానించబడిన అతిథుల కోసం విస్తృతమైన మెనూ ప్లాన్ చేయబడింది. విభిన్న శ్రేణి వంటకాలు, ఆహార అవసరాలకు అనుగుణంగా దృష్టి సారించడంతో అతిథులకు చిరస్మరణీయంగా భోజనాన్ని అందించేందుకు ప్లాన్ చేయబడింది.
25 మందికి పైగా మోస్ట్ పాపులర్ చెఫ్‌లు..
ఈ ఈవెంట్ కోసం 25 మందికి పైగా మోస్ట్ పాపులర్ చెఫ్‌లతో కూడిన ప్రత్యేక బృందం ఇండోర్ నుండి జామ్ నగర్‌కు వెళ్లనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యాంగా ఇండోర్ ఫుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అంతే కాకుండా పాన్-ఆసియన్ వంటకాలు కాకుండా పార్సీ ఆహారం నుండి థాయ్, మెక్సికన్, జపనీస్ వరకు వంటకాలు ఉండనున్నాయి. మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మొత్తం 2,500 వంటకాలు మెనూలో ఉంటాయి. ఇందులో ఒక్క వంటకం కూడా ఏవీ రిపీట్ కాకుండా చూస్తున్నారు. అల్పాహారంలో 70కి పైగా ఎంపికలు ఉంటాయి. లంచ్ కోసం 250 ఎంపికలు, రాత్రి భోజనం కోసం 250 ఎంపికలు ఉంటాయి. అతిథులకు శాకాహారి వంటకాల కోసం ప్రత్యేక సదుపాయం కూడా ఉంది. ప్రత్యేకత ఏమిటంటే అర్ధరాత్రి కూడా స్నాక్స్ కూడా అందించబడతాయి.
ఐదు ఈవెంట్లు..
మూడు రోజుల పాటు జరిగే అనంత్ మరియు రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఐదు ఈవెంట్లు ఉంటాయి. బిల్ గేట్స్ మరియు మెలిండా గేట్స్‌తో సహా ఈ వేడుకలకు 1,000 మంది అతిథులు ఆహ్వానించబడ్డారు. కాగా అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ జనవరి 19, 2023న ముంబైలో గోల్ ధన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పెళ్లి మాత్రం అందరికీ గుర్తిండిపోయే విధంగా చేయనున్నారు ముఖేష్ అంబానీ.