Watch Video: తమ్ముడంటే ఎంత ప్రేమ.. రాఖీ కట్టేందుకు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్న అవ్వ..
అన్న చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమ బందమే వేరు. అమ్మనాన్నలు చూపించేంతటి ప్రేమ వీరిద్దరి మధ్య ఉంటుంది. తరచూ కీచులాడుకున్నా.. కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. చివరకు ఇద్దరూ ఒక్కటవుతారు. ఎవరికి ఎలాంటి అపాయం కలిగినా.. వెంటనే చలించిపోతారు. అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల బంధానికి ప్రతీకే రక్షా బంధన్.. జీవితాంతం రక్షగా ఉంటాడనే విశ్వాసానికి ప్రతీకి ఈ రాఖీ. నేడు రాఖీ పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తమ అన్నలకు, తమ్ముళ్లకు రాఖీ కట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆడపడుచులు. కొందరు అక్కాచెల్లెల్లు రాఖీ పండుగ వేళ...

అన్న చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమ బందమే వేరు. అమ్మనాన్నలు చూపించేంతటి ప్రేమ వీరిద్దరి మధ్య ఉంటుంది. తరచూ కీచులాడుకున్నా.. కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. చివరకు ఇద్దరూ ఒక్కటవుతారు. ఎవరికి ఎలాంటి అపాయం కలిగినా.. వెంటనే చలించిపోతారు. అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల బంధానికి ప్రతీకే రక్షా బంధన్.. జీవితాంతం రక్షగా ఉంటాడనే విశ్వాసానికి ప్రతీకి ఈ రాఖీ. నేడు రాఖీ పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తమ అన్నలకు, తమ్ముళ్లకు రాఖీ కట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆడపడుచులు. కొందరు అక్కాచెల్లెల్లు రాఖీ పండుగ వేళ సుదూర ప్రాంతాల నుంచి అన్నదమ్ముళ్ల వద్దకు చేరుకుంటున్నారు. అయితే, ఈ రక్షా బంధన్ పర్వదినాన.. ఓ అవ్వ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 కిలోమీటర్లు కాలి నడకన నడుచుకుంటూ వెళ్తోంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఈ అవ్వ తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు నడుచుకుంటూనే పొరుగున ఉన్న కొండయ్యపల్లికి పయనమైంది. నడుచుకుంటూ ఎక్కడికి పోతున్నవ్ అవ్వా అని ఓ బాటసారి పలుకరించగా.. తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళ్తున్నానని బదులిచ్చింది. అయితే, ఈ వీడియోను సదరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతంది. తమ్ముడంటే ఆ అక్కకు ఎంత ప్రేమ అంటూ తమ అక్కా చెల్లెల్లను గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు.
