AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వామ్మో! ఆమెకు ఇదేం వింత కోరిక.. నెలకోసారి గర్భం దాల్చుతుందట.!

సాధారణంగా అందరి ఇష్టాఇష్టాలు ఒకేలా ఉండవు.. ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన ఇష్టం ఉంటుంది. కొందరి ఇష్టాలు చాలా విచిత్రంగానూ.. వింతగానూ..

Viral: వామ్మో! ఆమెకు ఇదేం వింత కోరిక.. నెలకోసారి గర్భం దాల్చుతుందట.!
Pregnancy
Ravi Kiran
|

Updated on: Feb 09, 2022 | 7:23 PM

Share

సాధారణంగా అందరి ఇష్టాఇష్టాలు ఒకేలా ఉండవు.. ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన ఇష్టం ఉంటుంది. కొందరి ఇష్టాలు చాలా విచిత్రంగానూ.. వింతగానూ ఉంటాయి. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కూడా అలాంటిదే. ఇక్కడ ఓ యువతికి గర్భం దాల్చడమంటే ఇష్టమట. గర్బవతి కావడం ఇష్టమట కానీ.. పిల్లల్ని కనడం ఇష్టముండదట. ఇదేమి ఇష్టమో.. అమెరికాకు చెందిన 22 ఏళ్ల ఓ లెస్బియన్ యువతికి ప్రతి మహిళలానే ప్రెగ్నెంట్ కావడమంటే ఇష్టమట. కానీ అది తనకి సాధ్యం కాదు. ఎందుకంటే సాధారణంగా లెస్బియన్స్ గర్భం దాల్చడం అనేది జరగదు. వారు పురుషులతో కలవడానికి ఇష్టపడరు. అయితే ఎందుకో తెలీదు కానీ ఈమెకి మాత్రం ప్రెగ్నెంట్ మహిళలంటే చాలా ఇష్టమట. తానూ వారిలాగే గర్భం దాల్చాలనుకుంటుంది కానీ తనకు పిల్లలను కనడం మాత్రం ఇష్టంలేదు.

కానీ ఈ యువతి తాను అనుకున్నది సాధించుకుంది. తన అభిరుచికి తగ్గట్టుగా తానూ గర్భం దాల్చింది. అందుకు ఈమె ఒక ట్రిక్‌ ప్లే చేసింది. అదేంటంటే ఓ సిలికాన్ బేబీ బంప్‌ను పొట్ట వద్ధ ధరిస్తే చూడటానికి అచ్చం గర్భిణీ స్త్రీ లానే కనిపిస్తుంది. అస్పలు డౌట్‌ రాదు. అయితే ఈ సిలికాన్ బేబీ బంప్‌ కోసం ఈ యువతి 20వేల రూపాయలు ఖర్చుచేసిందట. ఇక ఈ యువతి తనకు నచ్చినప్పుడల్లా గర్భిణిలా ఫొటోలకు, వీడియోలకు ఫోజులిస్తూ తన విచిత్రమైన కోరికను నెరవేర్చుకుంటుంది. అది తనకు అలవాటుగా మారిపోవడంతో కనీసం నెలలో ఒకసారైనా బేబీ బంప్‌ను ధరించి గర్భవతిగా మారిపోతుంది. ఇలా ఈ యువతి తనను తానే ప్రెగ్నెంట్‌గా ఊహించుకొంటూ మురిసిపోతుంది. తాజాగా ఆమె తాను ప్రెగ్నెంట్‌గా కనిపిస్తున్న వీడియోను తన ఇన్‌స్టగ్రామ్‌లో షేర్ చేసింది. తన ప్రెగ్నెన్సీ కోరికను 20వేల రూపాయల సిలికాన్ ప్రెగ్నెన్సీ బెల్లీతో నెరవేర్చుకుంటున్నట్టు తన పోస్ట్‌లో పేర్కొంది. ఇక తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు ఇదేమి వింత కోరికండీ బాబు అంటున్నారు.

View this post on Instagram

A post shared by Soph Mosca (@sophmosca)